Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’.. రానాకు జోడీ కుదిరింది! - telugu news rana pair up with malayam actress in bheemla nayak
close
Updated : 28/10/2021 20:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’.. రానాకు జోడీ కుదిరింది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌, రానా కలిసి నటిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. పవన్‌ కల్యాణ్‌ సరసన నిత్య మేనన్‌ నటిస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన చిత్ర బృందం రానాకు జోడీ ఎవరో చెప్పకుండా సినీ అభిమానుల్ని ఊరించింది. ఈ క్రమంలో పలువురి భామల పేర్లు తెరపైకి వచ్చాయి. రానాతో కలిసి నటించేంది ఈమెనే అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటన్నింటికీ చిత్ర బృందం తాజాగా చెక్‌ పెట్టింది. రానాతో కలిసి సందడి చేయనున్న నాయికని పరిచయం చేసింది. మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త ఈ చిత్రంలో నటిస్తున్నట్టు ప్రకటించింది. ఈ భామ ‘పాప్‌కార్న్‌’ (మలయాళం) అనే చిత్రంతో నటిగా మారింది. ‘అండర్‌ వరల్డ్‌’, ‘కల్కి’ తదితర చిత్రాలతో మలయాళ ప్రేక్షకుల్ని అలరించింది. పలు తమిళ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో.. కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘బింబిసార’తో తొలి అవకాశం అందుకుంది.

మలయాళ సూపర్‌హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌గా రూపొందుతోంది ‘భీమ్లా నాయక్’. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై  సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. పవన్‌ కల్యాన్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తుండగా డానియల్‌ శేఖర్‌గా రానా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని