‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’ ప్రారంభం - ysrcp mp bharat inaugurated bus hospital
close
Published : 13/05/2021 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’ ప్రారంభం

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో..

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రిలో ‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’ బస్సుల్ని వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ ప్రారంభించారు. రెండు ఆర్టీసీ స్లీపర్‌ బస్సుల్లో వైద్యానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కరోనా రోగుల కోసం వీటిని అందుబాటులోకి తెచ్చామని ఎంపీ అన్నారు. కొవిడ్‌తో బాధపడేవారికి ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు దొరికే వరకు ఆక్సిజన్‌తో పాటు ఇతర వైద్య సదుపాయాలను బస్సుల్లో అందించనున్నట్లు తెలిపారు. ఆస్పత్రి ఆవరణలోనే ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేసినట్లు ఎంపీ చెప్పారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని