సిద్ధార్థ్‌ని పట్టించుకోవద్దు: భాజపా  - bjp leader siddharth repeat offender dismisses claim of threatening him
close
Updated : 01/05/2021 12:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిద్ధార్థ్‌ని పట్టించుకోవద్దు: భాజపా 

హీరో ఆరోపణలపై స్పందించిన నేతలు

చెన్నై: కేంద్రప్రభుత్వంపై హీరో సిద్ధార్థ్‌ చేసే ఆరోపణలు, విమర్శలను ఎవ్వరూ పట్టించుకోవద్దని భాజపా నేతలు అన్నారు. తమిళనాడు భాజపా నేతలు తన ఫోన్‌ నంబర్‌ని లీక్‌ చేశారని.. దానివల్ల ఎంతోమంది నుంచి తనకు బెదిరింపులు ఎక్కువయ్యానని సిద్ధార్థ్‌ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో ఆరోపణలను తాజాగా పలువురు భాజపా నేతలు ఖండించారు. ఆయన ఎన్నోసార్లు భాజపా ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలే గుప్పించారని వారు మండిపడ్డారు.

భాజపా ఐటీ సెల్‌ విభాగాధిపతి నిర్మల్‌ కుమార్‌ స్పందిస్తూ.. ‘ప్రస్తుతం ఉన్న క్లిష్టపరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన ఆహారాన్ని, మందులను పంపిణీ చేయడంలో మేము ఎంతో నిమగ్నమై ఉన్నాం. భాజపా మద్దతుదారులందరికీ తెలియజేసేది ఏమిటంటే.. హీరో సిద్ధార్థ్‌తోపాటు ఆయన లాగా విమర్శలు చేసే వ్యక్తుల గురించి మీరు పట్టించుకోకండి. వాళ్లు కేవలం టైమ్‌పాస్‌ చేయడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తారు. ప్రజలకు సాయం చేయడంపైనే మీ దృష్టి ఉంచండి’ అని ట్వీట్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని