24గంటలు..284కేసులు
eenadu telugu news
Published : 01/08/2021 03:47 IST

24గంటలు..284కేసులు

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం జిల్లాలో గడచిన 24 గంటల్లో 284 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మహమ్మారి సోకి అయిదుగురు మరణించారు. తిరుపతి నగరం 32, చిత్తూరు నగరం 20, పుత్తూరు పట్టణం ఎనిమిది, నగరి, మదనపల్లె మున్సిపాలిటీల్లో నాలుగు చొప్పున, శ్రీకాళహస్తి పురపాలిక మూడు, పుంగనూరు పట్టణంలో ఒక కేసు వెలుగు చూసింది. తిరుపతి గ్రామీణ 26, తవణంపల్లె 22, తొట్టంబేడు 17, రేణిగుంట 12, పులిచెర్ల 11, ఐరాల 10, వెదురుకుప్పం తొమ్మిది, నారాయణవనం ఎనిమిది, చంద్రగిరి, యాదమరిలో ఆరు చొప్పున, పీలేరు, బంగారుపాళ్యం, సత్యవేడు, నాగలాపురం, పుత్తూరు గ్రామీణలో అయిదు చొప్పున, పాకాల, కంభంవారిపల్లె, నగరి గ్రామీణ, గుర్రంకొండలో నాలుగేసి, పెనుమూరు, కుప్పం, కలికిరిలో మూడు చొప్పున, సదుం, సోమల, బి.కొత్తకోట, రామసముద్రం, శ్రీకాళహస్తి గ్రామీణ, గంగాధరనెల్లూరు, ములకలచెరువులో రెండేసి, మదనపల్లె గ్రామీణ, కురబలకోట, రొంపిచెర్ల, కార్వేటినగరం, కలకడ, రామచంద్రాపురం, పెద్దపంజాణి, వడమాలపేట, పూతలపట్టు, రామకుప్పం, తంబళ్లపల్లె, బుచ్చినాయుడుకండ్రిగ, వాల్మీకిపురం, విజయపురం, చౌడేపల్లె, కేవీబీపురం, పుంగనూరు గ్రామీణ, నిండ్ర, పలమనేరు గ్రామీణ, పిచ్చాటూరు, గుడుపల్లెలో ఒక్కొక్కరు వైరస్‌ బారిన పడ్డారు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని