పీఎస్‌ఎల్‌వీ-సీ49కు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌

తాజా వార్తలు

Published : 06/11/2020 15:15 IST

పీఎస్‌ఎల్‌వీ-సీ49కు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌

శ్రీహరికోట: సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో పీఎస్‌ఎల్‌వీ-సీ49 వాహకనౌక కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ మధ్యాహ్నం 1.02 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌.. నిరంతరాయంగా 26 గంటలపాటు కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 3.02 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ49 వాహకనౌకను శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. పీఎస్‌ఎల్‌వీ మనదేశానికి చెందిన ఈవోఎస్‌-01తోపాటు, విదేశాలకు చెందిన 9 ఉప్రగహాలను నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. దేశానికి చెందిన భూపరిశీలన ఉపగ్రహం ద్వారా వాతావరణ, వ్యవసాయ, అటవీ సంబంధ సమాచారం తెలుసుకోవచ్చు. వాహకనౌకకు రూ.175 కోట్లు, ఉపగ్రహానికి రూ. 125 కోట్ల వరకు వ్యయం చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని