KTR: గిఫ్ట్‌ ఏ స్మైల్‌తో దివ్యాంగులకు చేయూత: కేటీఆర్‌ 

తాజా వార్తలు

Updated : 18/09/2021 13:10 IST

KTR: గిఫ్ట్‌ ఏ స్మైల్‌తో దివ్యాంగులకు చేయూత: కేటీఆర్‌ 

హైదరాబాద్‌: నగరంలోని బేగంపేట టూరిజం ప్లాజాలో ఎంపీ రంజిత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ట్రై మోటార్‌ వాహనాలను పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని 105 మంది దివ్యాంగులకు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘ఎంపీ రంజిత్‌రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద దివ్యాంగులకు చేయూతనిస్తున్నారు. రాష్ట్ర సమస్యలపై రంజిత్‌ రెడ్డి పార్లమెంట్‌లో ప్రశ్నిస్తున్నారు. చేవెళ్లలోని ప్రభుత్వాసుపత్రులకు 7 అంబులెన్స్‌లు ఇచ్చారు. కరోనా కాలంలో అన్ని గ్రామాలకు డిజిటల్‌ టీవీలు అందించారు. దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. దివ్యాంగులు అనేక రంగాల్లో రాణిస్తున్నారు’’ అని కేటీఆర్‌ అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని