సాయంత్రానికి మేయర్‌, ఛైర్మన్‌ అభ్యర్థుల జాబితా?
close

తాజా వార్తలు

Published : 15/03/2021 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాయంత్రానికి మేయర్‌, ఛైర్మన్‌ అభ్యర్థుల జాబితా?

మంత్రులు, కీలక నేతలతో సీఎం జగన్‌ భేటీ

అమరావతి: మంత్రులు, పార్టీకి చెందిన ముఖ్యనేతలతో వైకాపా అధినేత, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడైనందున మేయర్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు, నేతల అభిప్రాయాలను జగన్‌ తెలుసుకుంటున్నారు. 

ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైన స్థానాల్లో అభ్యర్థులను సీఎం ఎంపిక చేస్తున్నారు. మరోవైపు ఆయా జిల్లాల్లోని పరిస్థితులపైనా చర్చిస్తున్నారు. పార్టీకి విధేయులుగా ఉన్నవారు, ఇతర సమీకరణలను దృష్టిలో ఉంచుకుని మంత్రులు, ముఖ్యనేతల ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మేయర్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థులను సీఎం జగన్‌ ఖరారు చేసిన తర్వాత ఈ సాయంత్రానికి వారి జాబితాను ప్రకటించే అవకాశముంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని