MMTS: ఎంఎంటీఎస్‌ రైళ్లు వచ్చేస్తున్నాయ్‌!

తాజా వార్తలు

Updated : 21/06/2021 08:09 IST

MMTS: ఎంఎంటీఎస్‌ రైళ్లు వచ్చేస్తున్నాయ్‌!

బుధవారం నుంచి పరుగులు.. తొలుత 10 సర్వీసులు

ఈనాడు - హైదరాబాద్‌: నగర ప్రయాణికులకు శుభవార్త..! ఎట్టకేలకు ఎంఎంటీఎస్‌ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. కరోనా కారణంగా సరిగ్గా 15 నెలల ముందు ఆగిపోయిన ఎంఎంటీఎస్‌ రైళ్లు ఈనెల 23 (బుధవారం) నుంచి పట్టాలెక్కనున్నాయి.

ప్రజారవాణా అంతా పరుగులు పెడుతున్నా.. ఎంఎంటీఎస్‌ రైళ్లు ఎందుకు నడపడం లేదని తలలు పట్టుకున్న నగర ప్రయాణికులకు ఇది తీపి కబురు. బుధవారం నుంచి 10 ఎంఎంటీఎస్‌లు నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. రైల్వే మంత్రిత్వశాఖ ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆదేశాలిచ్చిందని సికింద్రాబాద్‌ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్‌రెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

ప్రస్తుతానికి 10 ఎంఎంటీఎస్‌లే.. ప్రస్తుతానికి ప్రతి రోజూ 10 ఎంఎంటీఎస్‌ రైళ్లు మాత్రమే బుధవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఫలక్‌నుమా నంచి లింగంపల్లికి 3 ఎంఎంటీఎస్‌ రైళ్లు, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు 3, హైదరాబాద్‌ నుంచి లింగంపల్లికి 2, లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు 2 ఎంఎంటీఎస్‌ రైళ్లు... ఇలా 10 ఎంఎంటీఎస్‌ రైళ్లు నడవనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని