close

తాజా వార్తలు

Updated : 14/04/2021 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జొన్నతోటలో బాలుడి అనుమానాస్పద మృతి

కుప్పం: ఏడేళ్ల బాలుడిని దుండగులు దారుణంగా హతమార్చి గ్రామ శివారులోని జొన్న తోటలో పడేసిన ఘటన మండలంలోని చీగలపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు వెంకటాచలపతి నిన్న సాయంత్రం నుంచి కనపడటం లేదు. ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామ దేవతలకు పూజలు చేసేందుకు మంగళవారం సాయంత్రం కొంతమంది గ్రామస్థులు, యువకులు వెళ్లగా వారితో పాటు వెంకటాచలం సైతం వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. అయితే.. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెంకటాచలం కోసం రాత్రి వెతకగా అర్థరాత్రి రోడ్డుపై రక్తపు మరకలు గుర్తించారు. పక్కనే ఉన్న జొన్నతోటలో గాలించగా బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడి ముఖం, శరీరంపై బలమైన గాయాలుండటంతో బాలుడిని అతికిరాతకంగా ఎవరైనా హతమార్చారా..? లేక ఏదైనా వాహనం ఢీకొనడంతో మృతిచెందాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవీ చదవండి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని