News In Pics: చిత్రం చెప్పే సంగతులు -01(21-01-2023)

Updated : 21 Jan 2023 09:08 IST
1/18
అనంతపురం జిల్లా శింగనమల సమీపంలోని చెరువు దాదాపు 2250 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గత ఏడాది వరదలకు నిండి మరువ పారింది. దీంతో దాదాపు 6 నెలల పాటు ఈ దారిలో రాకపోకలు నిలిపి వేశారు. ప్రస్తుతం మరువ తగ్గినా.. వరద ధాటికి రహదారి చాలా వరకు ధ్వంసమైంది. 2008లో నిర్మించిన ఈ దారి ధ్వంసమైనప్పటికీ తప్పనిసరి కావటంతో దీనిపై నుంచే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దెబ్బతిన్న రహదారిని మరమ్మతులు చేయించటం కంటే మరువ పారే ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అనంతపురం జిల్లా శింగనమల సమీపంలోని చెరువు దాదాపు 2250 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గత ఏడాది వరదలకు నిండి మరువ పారింది. దీంతో దాదాపు 6 నెలల పాటు ఈ దారిలో రాకపోకలు నిలిపి వేశారు. ప్రస్తుతం మరువ తగ్గినా.. వరద ధాటికి రహదారి చాలా వరకు ధ్వంసమైంది. 2008లో నిర్మించిన ఈ దారి ధ్వంసమైనప్పటికీ తప్పనిసరి కావటంతో దీనిపై నుంచే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దెబ్బతిన్న రహదారిని మరమ్మతులు చేయించటం కంటే మరువ పారే ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
2/18
పీర్జాదిగూడ నగర పాలక సంస్థ బుద్ధానగర్‌లో రూ.2 కోట్లతో రెండేళ్ల క్రితం వీధి వ్యాపారుల సముదాయం నిర్మించారు. కేటాయించక అవీ అలంకారప్రాయంగా మారాయి. పీర్జాదిగూడ నగర పాలక సంస్థ బుద్ధానగర్‌లో రూ.2 కోట్లతో రెండేళ్ల క్రితం వీధి వ్యాపారుల సముదాయం నిర్మించారు. కేటాయించక అవీ అలంకారప్రాయంగా మారాయి.
3/18
అపూర్వం.. అద్భుతం అనిపించే సింగారాలతో ఉద్యాననగరి బెంగళూరు లాల్‌బాగ్‌లో శుక్రవారం ఫలపుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. రాజధాని నగరంలో విశేషంగా ఆకట్టుకునే నిర్మాణాలు, కట్టడాలు, మందిరాలు, ప్రముఖుల విగ్రహాలు, చారిత్రక ఘట్ట నమూనా రూపాలను పూలతో అలంకరించి.. ప్రదర్శనకు సిద్ధం చేయగా- ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఢంకా మోగించి ప్రారంభిస్తున్న దృశ్యం. అపూర్వం.. అద్భుతం అనిపించే సింగారాలతో ఉద్యాననగరి బెంగళూరు లాల్‌బాగ్‌లో శుక్రవారం ఫలపుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. రాజధాని నగరంలో విశేషంగా ఆకట్టుకునే నిర్మాణాలు, కట్టడాలు, మందిరాలు, ప్రముఖుల విగ్రహాలు, చారిత్రక ఘట్ట నమూనా రూపాలను పూలతో అలంకరించి.. ప్రదర్శనకు సిద్ధం చేయగా- ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఢంకా మోగించి ప్రారంభిస్తున్న దృశ్యం.
4/18
  శ్రీకాకుళం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయం ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రగతి కానరావడంలేదు. ప్రత్యేక సందర్భాల్లో తాత్కాలిక ఏర్పాట్లు తప్ప శాశ్వత అభివృద్ధికి అడుగులు పడటం లేదు..

5/18
 సహజసిద్ధ, ఆహ్లాదకరమైన వాతావరణంతో విలసిల్లే మారేడుమిల్లి ప్రాంతానికి నిత్యం పర్యటకులు వందల సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడి పచ్చని, దట్టమైన అటవీ ప్రాంతాలు మధురమైన అనుభూతులను మిగుల్చుతున్నాయితెల్లవారుజామున సూర్యోదయ సమయంలో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి.

6/18
 యాదాద్రి పుణ్యక్షేత్రాభివృద్ధిలో కొండపైకి వచ్చి, పోయే మార్గాల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ఏడాది దాటినా పనులు పూర్తికాకపోవడంతో భక్తులు, స్థానికులు కొండెక్కి దిగేందుకు తిప్పలు పడుతున్నారు.

7/18
 ఖమ్మంలోని లకారం ట్యాంకుబండ్‌ వద్ద పర్యాటకులకు ఆహ్లాదం పంచేందుకు రూ.20 లక్షలతో రోప్‌ సైక్లింగ్‌ను గతంలో ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపంతో దాన్నెవరూ వినియోగించటం లేదు. సామగ్రి విరిగిపోతున్నా సిబ్బంది పట్టించుకోవటం లేదని పర్యాటకులు వాపోతున్నారు.

8/18
  జిల్లా కేంద్రం మెదక్‌లోని ఇందిరాగాంధీ స్టేడియం.. అథ్లెటిక్స్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు వేదిక కానుంది. శనివారం నుంచి పోటీలు మొదలుకానున్నాయి.

9/18
   వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి జిగేలుమంటోంది. కుడా ఆధ్వర్యంలో సెంట్రల్‌ డివైడర్ల సుందరీకరణ, లైటింగ్, ఆకర్షణీయమైన చిత్రాలు ఏర్పాటు చేశారు. కరుణాపురం ఔటరు రింగురోడ్డు బైపాస్‌ రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ) కింద, బయట రూ.10లక్షలతో ఆకట్టుకునే చిత్రాలు, గ్రీనరీ పనులు చేపట్టారు

10/18
పార్కింగ్‌ చేసిన వాహనాలు తొలగించకుండానే రోడ్లు వేస్తున్నారు. ఫలితంగా ప్యాచ్‌లు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ రాజీవ్‌ సర్కిల్‌ నుంచి బ్రాండ్‌ ఫ్యాక్టరీ వెళ్లే దారిలో రహదారి వేసినప్పుడు అక్కడ వాహనం ఉండటంతో వదిలేశారు. దీంతో ఆ ప్రాంతం ఎగుడు దిగుడుగా మారింది

11/18
 రంగారెడ్డి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్‌కు వెళ్లే మార్గం పచ్చందాలు సంతరించుకుంది. రహదారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన మొక్కలు ఆహ్లాదం పంచుతున్నాయి. 

12/18
 బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌) శతాబ్ది  ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం దర్పణ్‌ అకాడమీ ఆఫ్‌ ఫెర్మార్మింగ్‌   ఆర్ట్స్‌కు చెందిన డా.మల్లిక సారాబాయి బృందం చేసిన ‘డాన్స్‌ ఆఫ్‌ లైఫ్‌ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

13/18
 ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో గంగోత్రి  ఆలయాన్ని కప్పేసిన మంచు

14/18
 సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్‌ భవనంలోని లోక్‌సభ ప్రాంగణం

15/18
 ఆస్ట్రేలియాలోని ఎయిర్‌లీ బీచ్‌ సమీపంలో గుర్తించిన ప్రపంచంలోనే అతి పెద్దదిగా భావిస్తున్న కప్ప(టోడ్‌). ఇది ఆడది అని.. దీని బరువు 2.7 కిలోలు ఉంటుందని క్వీన్స్‌లాండ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సైన్స్‌ రేంజర్‌ కైలీ గ్రే పేర్కొన్నారు. మగ వాటి కంటే ఆడ కప్పలు పెద్దగా పెరుగుతాయని తెలిపారు.

16/18
 అంతర్జాతీయ చిరుధాన్యాల, సేంద్రియ మేళా-2023ను శుక్రవారం బెంగళూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలతో యువతులు చక్కని ముగ్గును వేశారు. మేళాకు విచ్చేసిన ప్రముఖులంతా ఈ ముగ్గును చూసి మురిసిపోయారు. 

17/18
 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ (ఐసీసీడబ్యూ)సంస్థ సాహస బాలల పురస్కారాలను ప్రకటించింది. 2020 సంవత్సరానికి 22 మందికి, 2021కిగాను 16 మందికి, 2022కుగాను 18 మందికి కలిపి దేశవ్యాప్తంగా 56 మంది వీటిని శుక్రవారం అందుకున్నారు.

18/18
 ఆడ పులి ఫర్హా నల్లమల అడవుల్లోని అమ్రాబాద్‌ అడవికి రాణిగా అవతరించింది. అటవీ అధికారులు ఎఫ్‌-6గా వ్యవహరించే ఫర్హా రెండు విడతల్లో ఆరింటికి జన్మనిచ్చింది. అందులో ఒకటైన ఎఫ్‌-18 పులి నాలుగింటికి జన్మనిచ్చింది. ఇలా అమ్రాబాద్‌ అడవుల అంతటా ఫర్హా కుటుంబం విస్తరిస్తోంది.

మరిన్ని