News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 01 Jul 2022 10:54 IST
1/14
సాధారణంగా చెట్టు ఎండిపోతే ఆకులు 

వాటంతట అవే రాలి పోతాయి. వృక్షం క్రమేపి 

మోడుబారి పోతుంది. కానీ పంట పొలంలో 

ఉన్న ఈ సపోట చెట్టు మాత్రం ఎండినా 

ఆకురాల్చలేదు. నీరు అందక ఈ చెట్టు 

చనిపోయింది. ఆకులు కూడా పూర్తిగా జీవం 

కోల్పోయినా రాలకపోవటం విశేషం. 

కూసుమంచి మండలంలో ఆసక్తికరంగా ఉన్న 

ఈ దృశ్యాన్ని ‘ఈనాడు’ కెమెరా బంధించింది. సాధారణంగా చెట్టు ఎండిపోతే ఆకులు వాటంతట అవే రాలి పోతాయి. వృక్షం క్రమేపి మోడుబారి పోతుంది. కానీ పంట పొలంలో ఉన్న ఈ సపోట చెట్టు మాత్రం ఎండినా ఆకురాల్చలేదు. నీరు అందక ఈ చెట్టు చనిపోయింది. ఆకులు కూడా పూర్తిగా జీవం కోల్పోయినా రాలకపోవటం విశేషం. కూసుమంచి మండలంలో ఆసక్తికరంగా ఉన్న ఈ దృశ్యాన్ని ‘ఈనాడు’ కెమెరా బంధించింది.
2/14
విద్యార్థులకు మరింత ప్రయోజనం కలిగించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి 

సబ్జెక్టులో ప్రతి పాఠానికి క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర విద్యాశాఖ రూపొందించిన దీక్ష యాప్‌ను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ 

చేసుకున్నట్లైతే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి వీడియో రూపంలో ఉన్న పాఠాలను వినవచ్చు. ప్రతి పాఠ్యాంశంలో ఒక్కో విషయానికి 

సంబంధించి పది నుంచి పదిహేను నిమిషాల నిడివితో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులతో రూపొందించిన సమగ్ర పాఠ్యాంశాలను చూసి 

సులభంగా అర్థం చేసుకోవచ్చు. మహబూబ్‌నగర్‌లోని షాసాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదివే ఇద్దరు విద్యార్థినులు క్యూఆర్‌ 

కోడ్‌ను స్కాన్‌ చేసి పాఠాలు వింటుండగా ‘ఈనాడు’ కెమెరా క్లిక్‌మనిపించింది. విద్యార్థులకు మరింత ప్రయోజనం కలిగించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి సబ్జెక్టులో ప్రతి పాఠానికి క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర విద్యాశాఖ రూపొందించిన దీక్ష యాప్‌ను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లైతే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి వీడియో రూపంలో ఉన్న పాఠాలను వినవచ్చు. ప్రతి పాఠ్యాంశంలో ఒక్కో విషయానికి సంబంధించి పది నుంచి పదిహేను నిమిషాల నిడివితో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులతో రూపొందించిన సమగ్ర పాఠ్యాంశాలను చూసి సులభంగా అర్థం చేసుకోవచ్చు. మహబూబ్‌నగర్‌లోని షాసాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదివే ఇద్దరు విద్యార్థినులు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పాఠాలు వింటుండగా ‘ఈనాడు’ కెమెరా క్లిక్‌మనిపించింది.
3/14
విజయవాడలోని గుణదలలో రైవస్‌ కాలువ గట్టుపై హైటెన్షన్‌ విద్యుత్తు తీగలు ఇళ్ల మధ్య ప్రమాదకరంగా ఉన్నాయి. గతంలో చేతికందే 

ఎత్తులోనే ఉండేవి. వాటిని ఆనుకొని ఇళ్లను నిర్మించుకున్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు తీగలను తొలగించి కొత్త స్తంభాలు వేశారు. పాత 

స్తంభాలు అలానే వదిలేశారు. కొన్నిచోట్ల పాత స్తంభాలు కొత్తగా వేసిన తీగలను తాకేలా ఉన్నాయి. కొన్ని చోట్ల ఇళ్లకు ఇచ్చే కరెంటు తీగలు 

భవనాలకు అతి సమీపం నుంచి వెళుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. విజయవాడలోని గుణదలలో రైవస్‌ కాలువ గట్టుపై హైటెన్షన్‌ విద్యుత్తు తీగలు ఇళ్ల మధ్య ప్రమాదకరంగా ఉన్నాయి. గతంలో చేతికందే ఎత్తులోనే ఉండేవి. వాటిని ఆనుకొని ఇళ్లను నిర్మించుకున్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు తీగలను తొలగించి కొత్త స్తంభాలు వేశారు. పాత స్తంభాలు అలానే వదిలేశారు. కొన్నిచోట్ల పాత స్తంభాలు కొత్తగా వేసిన తీగలను తాకేలా ఉన్నాయి. కొన్ని చోట్ల ఇళ్లకు ఇచ్చే కరెంటు తీగలు భవనాలకు అతి సమీపం నుంచి వెళుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
4/14
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామం దగ్గర రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ పరిస్థితి ఇది. చిత్రంలో కనిపిస్తున్న ఆ రోడ్డు 

నుంచే నాలుగు గ్రామాల ప్రజలు నిత్యం మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ కనీసం రక్షణ కంచె కూడా 

వేయకపోవడం గమనార్హం. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్తు లైన్లను పరిశీలించేందుకు వచ్చిన అధికారులు ఇక్కడి పరిస్థితిని 

గమనించారు. కానీ, బాగు చేయలేదు. ఎందుకని అడిగితే.. ‘ప్రస్తుతం మా వద్ద నిధుల్లేవు. ప్రతిపాదనలు పెట్టాం. నిధులు రాగానే సరి 

చేస్తాం’ అని అధికారులు అంటున్నారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామం దగ్గర రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ పరిస్థితి ఇది. చిత్రంలో కనిపిస్తున్న ఆ రోడ్డు నుంచే నాలుగు గ్రామాల ప్రజలు నిత్యం మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ కనీసం రక్షణ కంచె కూడా వేయకపోవడం గమనార్హం. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్తు లైన్లను పరిశీలించేందుకు వచ్చిన అధికారులు ఇక్కడి పరిస్థితిని గమనించారు. కానీ, బాగు చేయలేదు. ఎందుకని అడిగితే.. ‘ప్రస్తుతం మా వద్ద నిధుల్లేవు. ప్రతిపాదనలు పెట్టాం. నిధులు రాగానే సరి చేస్తాం’ అని అధికారులు అంటున్నారు.
5/14
ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై సిలిండర్‌ పెట్టి దానిపై మరో వ్యక్తిని కూర్చోబెట్టుకుని బుధవారం సాగర్‌ రోడ్డులో ప్రమాదకర ప్రయాణం చేస్తూ కనిపించాడు. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై సిలిండర్‌ పెట్టి దానిపై మరో వ్యక్తిని కూర్చోబెట్టుకుని బుధవారం సాగర్‌ రోడ్డులో ప్రమాదకర ప్రయాణం చేస్తూ కనిపించాడు.
6/14
చింతల్‌బస్తీలోని రోడ్డుపై ఓ కుర్రాడు ఇలా కేక్‌ కోస్తుండగా స్నేహితులు డప్పులు కొడుతున్నారు. ఈ బస్తీ కుర్రాడు గ్లోబల్‌ మిష్టర్‌ ఏషియా ఇంటర్నేషనల్‌ ఇండియా 2022లో మిస్టర్‌ డిజైనర్‌ లుక్‌ టైటిల్‌ దక్కించుకోవడంతో ఇలా వేడుక చేస్తున్నారు. డిగ్రీ చదువుతున్న ఈ కుర్రాడి పేరు సయ్యద్‌ రిజ్వాక్‌. చింతల్‌బస్తీలోని రోడ్డుపై ఓ కుర్రాడు ఇలా కేక్‌ కోస్తుండగా స్నేహితులు డప్పులు కొడుతున్నారు. ఈ బస్తీ కుర్రాడు గ్లోబల్‌ మిష్టర్‌ ఏషియా ఇంటర్నేషనల్‌ ఇండియా 2022లో మిస్టర్‌ డిజైనర్‌ లుక్‌ టైటిల్‌ దక్కించుకోవడంతో ఇలా వేడుక చేస్తున్నారు. డిగ్రీ చదువుతున్న ఈ కుర్రాడి పేరు సయ్యద్‌ రిజ్వాక్‌.
7/14
ఇవి పుచ్చకాయలే. పశ్చిమ జపాన్‌లోని కగవా ప్రాంతంలో పండించారు. ప్రత్యేక ఏర్పాట్లతో నలుపలకలుగా ఉత్పత్తి చేసిన వీటిని ఎక్కువగా ఆహార అలంకరణకే వాడతారు. ఒక్కో పుచ్చకాయ ధర సుమారు 5800రూపాయలు (10 వేల యెన్‌లు) పలుకుతోంది. ఇవి పుచ్చకాయలే. పశ్చిమ జపాన్‌లోని కగవా ప్రాంతంలో పండించారు. ప్రత్యేక ఏర్పాట్లతో నలుపలకలుగా ఉత్పత్తి చేసిన వీటిని ఎక్కువగా ఆహార అలంకరణకే వాడతారు. ఒక్కో పుచ్చకాయ ధర సుమారు 5800రూపాయలు (10 వేల యెన్‌లు) పలుకుతోంది.
8/14
న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బయ్య, ఇతర కార్యవర్గం గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బయ్య, ఇతర కార్యవర్గం గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
9/14
కుత్బుల్లాపూర్‌ గాజులరామారం ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల కొరత వేధిస్తోంది. సమస్య పరిష్కారానికి ఓ స్వచ్ఛంద సంస్థ తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. ఆ నిర్మాణ పనులు సాగుతున్నాయి. దీంతో విద్యార్థులు ఇలా చెట్ల కింద పాఠాలు వింటున్నారు. కుత్బుల్లాపూర్‌ గాజులరామారం ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల కొరత వేధిస్తోంది. సమస్య పరిష్కారానికి ఓ స్వచ్ఛంద సంస్థ తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. ఆ నిర్మాణ పనులు సాగుతున్నాయి. దీంతో విద్యార్థులు ఇలా చెట్ల కింద పాఠాలు వింటున్నారు.
10/14
11/14
హైదరాబాద్‌ అంబర్‌పేటలో యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య గురువారం పర్యటించారు. స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అనంతరం దళిత నాయకుడు అజయ్‌కుమార్‌ ఇంట్లో భోజనం చేశారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలో యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య గురువారం పర్యటించారు. స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అనంతరం దళిత నాయకుడు అజయ్‌కుమార్‌ ఇంట్లో భోజనం చేశారు.
12/14
జర్మనీ రాజధాని బెర్లిన్‌లో స్ప్రీ నది తీరాన నిర్మించిన అతిపెద్ద థర్మల్‌ ట్యాంకు ఇది. దీని ఎత్తు 45 మీటర్లు. ఇందులో 5.60 కోట్ల లీటర్ల వేడినీళ్లను నిల్వ చేయవచ్చు. ఇందులోని నీటిని సౌర, పవన విద్యుత్తు ద్వారా వేడి చేసి, పలు ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు మంచినీరు గడ్డ కడుతుండటంతో ఈ ట్యాంకు నిర్మాణం తలపెట్టారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో స్ప్రీ నది తీరాన నిర్మించిన అతిపెద్ద థర్మల్‌ ట్యాంకు ఇది. దీని ఎత్తు 45 మీటర్లు. ఇందులో 5.60 కోట్ల లీటర్ల వేడినీళ్లను నిల్వ చేయవచ్చు. ఇందులోని నీటిని సౌర, పవన విద్యుత్తు ద్వారా వేడి చేసి, పలు ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు మంచినీరు గడ్డ కడుతుండటంతో ఈ ట్యాంకు నిర్మాణం తలపెట్టారు.
13/14
చారిత్రక గోల్కొండ బోనాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. లంగర్‌హౌస్‌లో తొట్టెల, ఫలహారం బండికి పూజలు నిర్వహించి, కల్లు సాక సమర్పించిన మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చారిత్రక గోల్కొండ బోనాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. లంగర్‌హౌస్‌లో తొట్టెల, ఫలహారం బండికి పూజలు నిర్వహించి, కల్లు సాక సమర్పించిన మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
14/14

మరిన్ని