News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (06-08-2022)

Updated : 06 Aug 2022 13:37 IST
1/20
తమ ఇంట పుట్టిన తొమ్మిది నెలల తొలిసారి చూడి గోవుకు సీమంతం కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా మామిడికుదుదరు మండలంలోని నగరంలో శుక్రవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్థానిక వానరాశి త్రిమూర్తులు, అమ్మాజీ దంపతులు, కుమార్తె లక్ష్మీదుర్గ పదకొండు మంది పేరంటాళ్లతో దీనిని భక్తిశ్రద్ధలతో పవిత్రంగా జరిపారు. గోమాత నుదుటున పసుపు, కుంకుమ రాసి మెడలో పూలమాలలు, కొమ్ములకు గాజులు వేశారు. పట్టు చీరను మెడ చుట్టూ చక్కగా చుట్టి అలంకరించారు. అంతా గోవు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి మంగళ హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా పేరంటాళ్లందరికీ వాయనాలు అందజేశారు.. తమ ఇంట పుట్టిన తొమ్మిది నెలల తొలిసారి చూడి గోవుకు సీమంతం కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా మామిడికుదుదరు మండలంలోని నగరంలో శుక్రవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్థానిక వానరాశి త్రిమూర్తులు, అమ్మాజీ దంపతులు, కుమార్తె లక్ష్మీదుర్గ పదకొండు మంది పేరంటాళ్లతో దీనిని భక్తిశ్రద్ధలతో పవిత్రంగా జరిపారు. గోమాత నుదుటున పసుపు, కుంకుమ రాసి మెడలో పూలమాలలు, కొమ్ములకు గాజులు వేశారు. పట్టు చీరను మెడ చుట్టూ చక్కగా చుట్టి అలంకరించారు. అంతా గోవు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి మంగళ హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా పేరంటాళ్లందరికీ వాయనాలు అందజేశారు..
2/20
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో కనకదుర్గమ్మ అమ్మవారిని నోట్ల కట్టలతో విశేషంగా అలంకరించారు. నిర్వాహకులు, దాతల సహకారంతో సమకూరిన సుమారు రూ.10 లక్షలు విలువైన నోట్ల కట్టలతో అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో కనకదుర్గమ్మ అమ్మవారిని నోట్ల కట్టలతో విశేషంగా అలంకరించారు. నిర్వాహకులు, దాతల సహకారంతో సమకూరిన సుమారు రూ.10 లక్షలు విలువైన నోట్ల కట్టలతో అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
3/20
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కర్నూలు నగరంలో త్రివర్ణం మెరిసిపోతోంది. కట్టడాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఇందులో భాగంగా హంద్రీ వంతెనపై విద్యుత్తు స్తంభాలకు ఏర్పాటు చేసిన మువ్వన్నెల రంగులు వెలిగిపోతున్నాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కర్నూలు నగరంలో త్రివర్ణం మెరిసిపోతోంది. కట్టడాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఇందులో భాగంగా హంద్రీ వంతెనపై విద్యుత్తు స్తంభాలకు ఏర్పాటు చేసిన మువ్వన్నెల రంగులు వెలిగిపోతున్నాయి.
4/20
తెలంగాణలోని రేషన్‌ బియ్యాన్ని రైలులో మహారాష్ట్రకు తరలించి విక్రయించేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నారు. రైల్వే పోలీసుల తనిఖీలు ఎక్కువ కావడంతో అక్రమ దందా చేసే వ్యాపారులు రూట్‌ మార్చారు. రైలులో బియ్యం బస్తాలు ఉంటే పోలీసులు పట్టుకోవడం లేదా కింద పడేయడం చేస్తున్నారు. దీంతో వ్యాపారులు రైలు ఎక్కగానే బియ్యాన్ని బోగీలోని తలుపుల పక్కన పోసి సంచులను కనిపించకుండా దాస్తున్నారు. మహారాష్ట్ర సమీసిస్తున్న సమయంలో తిరిగి ఆ బియ్యాన్ని సంచుల్లో నింపుకొంటున్నారు. ఈ చిత్రం భద్రాచల రోడ్‌ నుంచి బల్లార్షా వరకు వెళ్తున్న సింగరేణి ఎక్స్‌ప్రెస్‌లో మందమర్రి వద్ద కనిపించింది. తెలంగాణలోని రేషన్‌ బియ్యాన్ని రైలులో మహారాష్ట్రకు తరలించి విక్రయించేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నారు. రైల్వే పోలీసుల తనిఖీలు ఎక్కువ కావడంతో అక్రమ దందా చేసే వ్యాపారులు రూట్‌ మార్చారు. రైలులో బియ్యం బస్తాలు ఉంటే పోలీసులు పట్టుకోవడం లేదా కింద పడేయడం చేస్తున్నారు. దీంతో వ్యాపారులు రైలు ఎక్కగానే బియ్యాన్ని బోగీలోని తలుపుల పక్కన పోసి సంచులను కనిపించకుండా దాస్తున్నారు. మహారాష్ట్ర సమీసిస్తున్న సమయంలో తిరిగి ఆ బియ్యాన్ని సంచుల్లో నింపుకొంటున్నారు. ఈ చిత్రం భద్రాచల రోడ్‌ నుంచి బల్లార్షా వరకు వెళ్తున్న సింగరేణి ఎక్స్‌ప్రెస్‌లో మందమర్రి వద్ద కనిపించింది.
5/20
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్‌ పరిమళించే పట్టుచీరను రూపొందించి ఔరా అనిపించాడు. విజయ్‌ ఐదున్నర మీటర్ల పొడవున్న ఎర్రని పరిమళించే పట్టుచీరను తయారు చేశాడు. పట్టుచీరను నేసి, డైయింగ్‌ సమయంలో సువాసననిచ్చే శ్రీగంధం కలిపినట్లు వెల్లడించారు. దీనివల్ల చీర నిత్యం పరిమళిస్తూ ఉంటుందని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్‌ పరిమళించే పట్టుచీరను రూపొందించి ఔరా అనిపించాడు. విజయ్‌ ఐదున్నర మీటర్ల పొడవున్న ఎర్రని పరిమళించే పట్టుచీరను తయారు చేశాడు. పట్టుచీరను నేసి, డైయింగ్‌ సమయంలో సువాసననిచ్చే శ్రీగంధం కలిపినట్లు వెల్లడించారు. దీనివల్ల చీర నిత్యం పరిమళిస్తూ ఉంటుందని పేర్కొన్నారు.
6/20
ఈ చిత్రం చూస్తుంటే మహానగరంలో పచ్చని చెట్ల మధ్య దూసుకుపోతున్న మెట్రో రైలులా కనిపిస్తోంది కదూ. వాస్తవానికి ఇవి బంజారాహిల్స్‌లో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికుల తాత్కాలిక నివాసాలు. రేకులతో వరుసగా ఏర్పాటు చేయడంతో ఇలా రైలు బండిని తలపిస్తున్నాయి. ఈ చిత్రం చూస్తుంటే మహానగరంలో పచ్చని చెట్ల మధ్య దూసుకుపోతున్న మెట్రో రైలులా కనిపిస్తోంది కదూ. వాస్తవానికి ఇవి బంజారాహిల్స్‌లో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికుల తాత్కాలిక నివాసాలు. రేకులతో వరుసగా ఏర్పాటు చేయడంతో ఇలా రైలు బండిని తలపిస్తున్నాయి.
7/20
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా పలు కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు సైతం వరలక్ష్మీ వ్రతం చేసుకుని ఆజాదీకా అమృతోత్సవ స్ఫూర్తి కలిగించేలా తోటి మహిళలకు వాయనాలు అందజేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నివసించే అత్తాకోడళ్లు విజయలక్ష్మీ, కీర్తి తమ ఇంట్లో వరలక్ష్మీ వ్రతం జరుపుకొని ఇరుగుపొరుగు మహిళలకు మొక్కలు, జాతీయ పతకాలను బహుమతులుగా అందజేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా పలు కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు సైతం వరలక్ష్మీ వ్రతం చేసుకుని ఆజాదీకా అమృతోత్సవ స్ఫూర్తి కలిగించేలా తోటి మహిళలకు వాయనాలు అందజేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నివసించే అత్తాకోడళ్లు విజయలక్ష్మీ, కీర్తి తమ ఇంట్లో వరలక్ష్మీ వ్రతం జరుపుకొని ఇరుగుపొరుగు మహిళలకు మొక్కలు, జాతీయ పతకాలను బహుమతులుగా అందజేశారు.
8/20
మట్టి కుప్పలతో నిండిన ఈ రహదారి ఏ గ్రామంలోనిదో అనుకుంటే పొరపాటే. నిజంగా ఇది జాతీయ రహదారే. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ సమీప ప్రాంతాల నుంచి వరద కాలువను ఎదులాబాద్‌ మూసీ వరకు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారి 163 హైదరాబాద్‌-వరంగల్‌ మార్గంలో జోడిమెట్ల వద్ద రెండు కల్వర్టులను సైతం ఆధునికీకరిస్తున్నారు. ఇక్కడ రక్షణ చర్యలు ఏ మాత్రం కనిపించడం లేదు. కొన్ని నెలలుగా పనులు సాగుతుండడంతో ఈ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నిమిషానికి 60నుంచి 70 వాహనాలు ప్రయాణించాల్సి ఉండగా ప్రస్తుతం 20 కూడా వెళ్లడం లేదు. వారం కిందట ఇక్కడే ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మట్టి కుప్పలతో నిండిన ఈ రహదారి ఏ గ్రామంలోనిదో అనుకుంటే పొరపాటే. నిజంగా ఇది జాతీయ రహదారే. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ సమీప ప్రాంతాల నుంచి వరద కాలువను ఎదులాబాద్‌ మూసీ వరకు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారి 163 హైదరాబాద్‌-వరంగల్‌ మార్గంలో జోడిమెట్ల వద్ద రెండు కల్వర్టులను సైతం ఆధునికీకరిస్తున్నారు. ఇక్కడ రక్షణ చర్యలు ఏ మాత్రం కనిపించడం లేదు. కొన్ని నెలలుగా పనులు సాగుతుండడంతో ఈ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నిమిషానికి 60నుంచి 70 వాహనాలు ప్రయాణించాల్సి ఉండగా ప్రస్తుతం 20 కూడా వెళ్లడం లేదు. వారం కిందట ఇక్కడే ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
9/20
10/20
రక్షాబంధన్‌ను పురస్కరించుకుని గుజరాత్‌లోని సూరత్‌లో రాఖీ కట్టిన విద్యార్థినులకు జాతీయ జెండాను బహుకరిస్తున్న ముస్లిం విద్యార్థులు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని గుజరాత్‌లోని సూరత్‌లో రాఖీ కట్టిన విద్యార్థినులకు జాతీయ జెండాను బహుకరిస్తున్న ముస్లిం విద్యార్థులు.
11/20
పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు, జీఎస్టీ అంశాలపై నిరసనల్లో భాగంగా శుక్రవారం దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద బారికేడ్లు దాటేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు, జీఎస్టీ అంశాలపై నిరసనల్లో భాగంగా శుక్రవారం దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద బారికేడ్లు దాటేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.
12/20
ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రార్థనల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న షియా వర్గ నేత ముక్తాదా అల్‌ సదర్‌ అనుచరులు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రార్థనల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న షియా వర్గ నేత ముక్తాదా అల్‌ సదర్‌ అనుచరులు.
13/20
పైచిత్రాల్లో కనిపిస్తున్నది అయిదు రోడ్లు కలిసే కీలకమైన టీహబ్‌ కూడలి. ఇంకా ట్రాఫిక్‌ సిగ్నళ్లు ఏర్పాటు చేయలేదు. వాహనాల క్రమబద్ధీకరణ కోసం తాళ్లు కట్టారు. వాహనదారులు ఆ తాళ్లు ఎత్తి వెళుతుండడం వల్ల ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా తయారవుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పైచిత్రాల్లో కనిపిస్తున్నది అయిదు రోడ్లు కలిసే కీలకమైన టీహబ్‌ కూడలి. ఇంకా ట్రాఫిక్‌ సిగ్నళ్లు ఏర్పాటు చేయలేదు. వాహనాల క్రమబద్ధీకరణ కోసం తాళ్లు కట్టారు. వాహనదారులు ఆ తాళ్లు ఎత్తి వెళుతుండడం వల్ల ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా తయారవుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
14/20
15/20
శ్రావణ మాసం, రెండో శుక్రవారం సందర్భంగా ఇంటింటా వరలక్ష్మి వ్రతాలు చేసుకున్న మహిళలు అమ్మవారి దర్శనానికి ఆలయాలకు భారీగా తరలివచ్చారు. కొత్తపేట అష్టలక్ష్మి, చార్మినార్‌ భాగ్యలక్ష్మి తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టలక్ష్మి అమ్మవారికి సాముహిక కుంకుమార్చన, పుష్పార్చన జరిపించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆయా ఆలయాల కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. శ్రావణ మాసం, రెండో శుక్రవారం సందర్భంగా ఇంటింటా వరలక్ష్మి వ్రతాలు చేసుకున్న మహిళలు అమ్మవారి దర్శనానికి ఆలయాలకు భారీగా తరలివచ్చారు. కొత్తపేట అష్టలక్ష్మి, చార్మినార్‌ భాగ్యలక్ష్మి తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టలక్ష్మి అమ్మవారికి సాముహిక కుంకుమార్చన, పుష్పార్చన జరిపించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆయా ఆలయాల కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.
16/20
17/20
శ్రావణ మాసోత్సవాలు, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా విశాఖపట్నం పాతనగరంలో కొలువైన శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని స్వర్ణ వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఐదేళ్ల కిందట 200 మంది భక్తులు విరాళాలు పోగేసుకొని రెండున్నర కొలోల బంగారంతో ఈ బంగారపు తొడుగును తయారు చేయించారు. అప్పటి నుంచి ఏటా ప్రత్యేక ఉత్సవాల్లో అమ్మవారు ఇలా స్వర్ణధారిగా దర్శనమిస్తున్నారు. శుక్రవారం పసిడి వర్ణంలో మెరిసిపోతున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. శ్రావణ మాసోత్సవాలు, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా విశాఖపట్నం పాతనగరంలో కొలువైన శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని స్వర్ణ వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఐదేళ్ల కిందట 200 మంది భక్తులు విరాళాలు పోగేసుకొని రెండున్నర కొలోల బంగారంతో ఈ బంగారపు తొడుగును తయారు చేయించారు. అప్పటి నుంచి ఏటా ప్రత్యేక ఉత్సవాల్లో అమ్మవారు ఇలా స్వర్ణధారిగా దర్శనమిస్తున్నారు. శుక్రవారం పసిడి వర్ణంలో మెరిసిపోతున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు.
18/20
లాలాపేటలోని లక్ష్మీనగర్‌ కాలనీలో మూడు నెలలుగా నాలా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఇళ్ల ముందు తవ్వి ఇలా ప్రమాదకరంగా వదిలేశారు. ఇళ్లలోకి వెళ్లేటప్పుడు ఏమాత్రం తూలినా నాలాలో పడటం ఖాయం. పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో.. ఇళ్లలోకి భద్రంగా ఎప్పుడు వెళ్తామోనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. లాలాపేటలోని లక్ష్మీనగర్‌ కాలనీలో మూడు నెలలుగా నాలా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఇళ్ల ముందు తవ్వి ఇలా ప్రమాదకరంగా వదిలేశారు. ఇళ్లలోకి వెళ్లేటప్పుడు ఏమాత్రం తూలినా నాలాలో పడటం ఖాయం. పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో.. ఇళ్లలోకి భద్రంగా ఎప్పుడు వెళ్తామోనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.
19/20
గూళ్ల నిర్మాణంలో ఒక్కో పక్షీ ఒక్కో తీరును అనుసరిస్తుంది. వైవిధ్యం ప్రదర్శిస్తుంది. గూడు కట్టడంలో గిజిగాడు చూపే నైపుణ్యం అందుకు అద్దం పడుతుంది. ఇదే పంథాలో కరీంనగర్‌ శివారు దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎండీ) వద్ద హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్ల సిమెంట్‌ దిమ్మెలకు పిచ్చుకల్లాంటి వందలాది పక్షులు బురద, బంకమట్టి మిశ్రమంతో గూళ్లను నిర్మించుకున్నాయి. మానేరు గలగలలకు తోడు తమ కిలకిలారావాలతో చూపరులకు ఆహ్లాదం పంచుతున్నాయి. గూళ్ల నుంచి నీటిలోకి ఎగురుతూ.. కీటకాలను గుటుక్కుమని పిస్తూ.. మరికొన్ని్ంటిని పిల్లలకు ఆహారంగా తెస్తూ అవి చేసే సందడి ఆకట్టుకుంటోంది. దిమ్మల నుంచి పడిపోకుండా అసలు ఇంత నైపుణ్యంతో ఇవి ఇలా గూళ్లెలా కట్టాయబ్బా అనిపిస్తుంది. గూళ్ల నిర్మాణంలో ఒక్కో పక్షీ ఒక్కో తీరును అనుసరిస్తుంది. వైవిధ్యం ప్రదర్శిస్తుంది. గూడు కట్టడంలో గిజిగాడు చూపే నైపుణ్యం అందుకు అద్దం పడుతుంది. ఇదే పంథాలో కరీంనగర్‌ శివారు దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎండీ) వద్ద హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్ల సిమెంట్‌ దిమ్మెలకు పిచ్చుకల్లాంటి వందలాది పక్షులు బురద, బంకమట్టి మిశ్రమంతో గూళ్లను నిర్మించుకున్నాయి. మానేరు గలగలలకు తోడు తమ కిలకిలారావాలతో చూపరులకు ఆహ్లాదం పంచుతున్నాయి. గూళ్ల నుంచి నీటిలోకి ఎగురుతూ.. కీటకాలను గుటుక్కుమని పిస్తూ.. మరికొన్ని్ంటిని పిల్లలకు ఆహారంగా తెస్తూ అవి చేసే సందడి ఆకట్టుకుంటోంది. దిమ్మల నుంచి పడిపోకుండా అసలు ఇంత నైపుణ్యంతో ఇవి ఇలా గూళ్లెలా కట్టాయబ్బా అనిపిస్తుంది.
20/20

మరిన్ని