News In Pics : చిత్రం చెప్పే సంగతులు - 2 (18-11-2022)

Updated : 18 Nov 2022 19:39 IST
1/11
‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా హన్వాడ మండలం కారం తండాకు చెందిన దివ్యాంగుడు హరియా నాయక్‌కు త్రిచక్ర వాహనం అందజేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా హన్వాడ మండలం కారం తండాకు చెందిన దివ్యాంగుడు హరియా నాయక్‌కు త్రిచక్ర వాహనం అందజేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
2/11
హైదరాబాద్‌ అత్తాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వాచ్‌ షోరూం ప్రారంభోత్సవంలో నటి మన్నారా చోప్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. హైదరాబాద్‌ అత్తాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వాచ్‌ షోరూం ప్రారంభోత్సవంలో నటి మన్నారా చోప్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.
3/11
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం ఓడరేవులో యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ సుకన్యను ప్రదర్శనకు ఉంచారు. దీంతో జిల్లా వాసులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి నౌక విశేషాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం ఓడరేవులో యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ సుకన్యను ప్రదర్శనకు ఉంచారు. దీంతో జిల్లా వాసులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి నౌక విశేషాలను ఆసక్తిగా తెలుసుకున్నారు.
4/11
ఇటీవలే రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సండ్ర వీరయ్య ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు వారికి ఘన స్వాగతం పలికాయి. ఇటీవలే రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సండ్ర వీరయ్య ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు వారికి ఘన స్వాగతం పలికాయి.
5/11
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మహారాష్ట్రలో సాగుతోంది. యాత్రలో మహాత్మాగాంధీ మనవడు తుషార్‌ గాంధీ పాల్గొన్నారు. రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. ఇవాళ యాత్ర ముగిసిన అనంతరం షెగావ్‌లో భారీ బహిరంగసభ నిర్వహించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మహారాష్ట్రలో సాగుతోంది. యాత్రలో మహాత్మాగాంధీ మనవడు తుషార్‌ గాంధీ పాల్గొన్నారు. రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. ఇవాళ యాత్ర ముగిసిన అనంతరం షెగావ్‌లో భారీ బహిరంగసభ నిర్వహించారు.
6/11
భారత అంతరిక్షయాన రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి తొలి ప్రైవేటు రాకెట్‌ ‘విక్రమ్‌-ఎస్‌’ నింగిలోకి వెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. భారత అంతరిక్షయాన రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి తొలి ప్రైవేటు రాకెట్‌ ‘విక్రమ్‌-ఎస్‌’ నింగిలోకి వెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
7/11
జపాన్‌లో గ్రాండ్‌ ప్రి ఫిగర్‌ స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. యూఎస్‌కు చెందిన కరోలిన్‌ గ్రీన్‌, మిచెల్‌ అందులో పాల్గొన్నారు. తమదైన శైలిలో ఐస్‌ డ్యాన్స్‌ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. జపాన్‌లో గ్రాండ్‌ ప్రి ఫిగర్‌ స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. యూఎస్‌కు చెందిన కరోలిన్‌ గ్రీన్‌, మిచెల్‌ అందులో పాల్గొన్నారు. తమదైన శైలిలో ఐస్‌ డ్యాన్స్‌ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
8/11
కోనసీమ జిల్లా మండపేటలో ‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నాయకులు ధాన్యాన్ని రహదారిపై పారబోసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, జవహర్‌ తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా మండపేటలో ‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నాయకులు ధాన్యాన్ని రహదారిపై పారబోసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, జవహర్‌ తదితరులు పాల్గొన్నారు.
9/11
హుస్సేన్‌సాగర్‌ చెంత ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ట్రయల్‌ రన్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19, 20వ తేదీల్లో జరిగే రేస్‌లో పాల్గొనే కార్లు గురువారం హుస్సేన్‌సాగర్‌ తీరానికి చేరాయి. 30 పైనే కార్లను తీసుకొచ్చారు. హుస్సేన్‌సాగర్‌ చెంత ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ట్రయల్‌ రన్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19, 20వ తేదీల్లో జరిగే రేస్‌లో పాల్గొనే కార్లు గురువారం హుస్సేన్‌సాగర్‌ తీరానికి చేరాయి. 30 పైనే కార్లను తీసుకొచ్చారు.
10/11
నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘18 పేజెస్‌’. సుకుమార్‌ రైటింగ్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని ‘నన్నయ్య రాసిన..’ అంటూ సాగే లిరికల్ గీతాన్ని ఈ నెల 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘18 పేజెస్‌’. సుకుమార్‌ రైటింగ్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని ‘నన్నయ్య రాసిన..’ అంటూ సాగే లిరికల్ గీతాన్ని ఈ నెల 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.
11/11
రెండు కార్లలో తరలిస్తున్న 100 కేజీల గంజాయిని 
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర టోల్‌ప్లాజా వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు వీటిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లలో తరలిస్తున్న 100 కేజీల గంజాయిని విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర టోల్‌ప్లాజా వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు వీటిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని