News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (27-05-2023)

Updated : 27 May 2023 12:13 IST
1/15
 పెద్దపల్లి  జిల్లాలోని సుల్తానాబాద్‌ యాదవనగర్‌కు చెందిన పల్లె తిరుపతి ట్రాక్టరు ట్యాంకరుతో ఇళ్లకు, రహదారి నిర్మాణానికి, ఇటుక బట్టీలు, పరిశ్రమల అవసరాలకు నీళ్లు సరఫరా చేస్తారు. కొద్దికాలంగా ఆర్డర్లు లేకపోవడంతో ట్యాంకరుకు తుప్పు పట్టకుండా ఇలా చెట్టుపై కట్టేశారు. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌ యాదవనగర్‌కు చెందిన పల్లె తిరుపతి ట్రాక్టరు ట్యాంకరుతో ఇళ్లకు, రహదారి నిర్మాణానికి, ఇటుక బట్టీలు, పరిశ్రమల అవసరాలకు నీళ్లు సరఫరా చేస్తారు. కొద్దికాలంగా ఆర్డర్లు లేకపోవడంతో ట్యాంకరుకు తుప్పు పట్టకుండా ఇలా చెట్టుపై కట్టేశారు.
2/15
  ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం(హెల్మెట్) ధరించాలని, రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలనే ఉద్దేశంతో సంగారెడ్డి పట్టణంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీసులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.

3/15
 అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కాన్పులు, ఆరోగ్యశ్రీ వార్డుల్లో పంకాలు సరిగా తిరగకపోవడంతో ఉక్కపోత భరించలేక రోగులు ఇళ్ల వద్ద నుంచి పంకాలు తెచ్చుకుని వినియోగించుకుంటున్నారు.

4/15
కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల నుంచి ఆళ్లగడ్డకు వెళ్లే ప్రధానమార్గంలో భీమునిపాడు, కంపమల్ల మెట్ట గ్రామాల మధ్య కుందరవాగు వంతెనపై ప్రయాణం భయాన్ని కలిగిస్తోంది. కుందరవాగుపై 1932లో వంతెన నిర్మించారు. ఇది ఇప్పుడు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల నుంచి ఆళ్లగడ్డకు వెళ్లే ప్రధానమార్గంలో భీమునిపాడు, కంపమల్ల మెట్ట గ్రామాల మధ్య కుందరవాగు వంతెనపై ప్రయాణం భయాన్ని కలిగిస్తోంది. కుందరవాగుపై 1932లో వంతెన నిర్మించారు. ఇది ఇప్పుడు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది.
5/15
 అమరావతి ప్రాంతమైన తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 16వ జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టారు. 

6/15
విశాఖపట్నం సాగర తీరంలోని కిర్లంపూడి లేఅవుట్‌లో ఓ భవంతిలో పచ్చదనానికి పెద్దపీట వేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుండీల్లో పెంచుతున్న మొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. భవనానికి ప్రత్యేక అందం కూడా తెచ్చాయి.

7/15
 హైదరాబాద్‌లోని  ఐడీపీఎల్‌ జంక్షన్‌లో జరుగుతున్న సుందరీకరణ పనుల్లో భాగంగా ఫుట్‌పాత్‌ నిర్మాణం, టైల్స్, చెట్లతో చుట్టూ పార్క్‌ ఏర్పాటు చేశారు. దాంతో పరిసరాలు అందంగా కన్పిస్తున్నాయి.

8/15
 వరంగల్‌ బస్టాండు సమీపంలో కొన్ని ద్విచక్ర వాహనాలు గుట్టపైకెక్కాయి. ట్రాఫిక్‌ పోలీసు తనిఖీల్లో లైసెన్సు, తగిన గుర్తింపు పత్రాలు లేని వాహనాలను పోలీసులు దగ్గర్లోని పార్కింగ్‌ స్థలాల్లో భద్రపరుస్తారు. కొంతమంది చలాన్లు చెల్లించలేక తమ వాహనాలను అలాగే వదిలేస్తున్నారు. వరంగల్‌ బస్టాండు సమీపంలో కొన్ని ద్విచక్ర వాహనాలు గుట్టపైకెక్కాయి. ట్రాఫిక్‌ పోలీసు తనిఖీల్లో లైసెన్సు, తగిన గుర్తింపు పత్రాలు లేని వాహనాలను పోలీసులు దగ్గర్లోని పార్కింగ్‌ స్థలాల్లో భద్రపరుస్తారు. కొంతమంది చలాన్లు చెల్లించలేక తమ వాహనాలను అలాగే వదిలేస్తున్నారు.
9/15
 మహారాష్ట్రలోని వషిం జిల్లా మాలెగాం తాలుకా శిర్పూర్‌లో శ్రీదిగంబర్‌ జైన్‌ సర్వయోగి ధార్మిక్‌ న్యాస్‌ ఆధ్వర్యంలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం మన రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా నుంచి అవసరమైన బండరాళ్లను అక్కడకు తరలిస్తున్నారు. 

10/15
పారిశుద్ధ్య నిర్వహణకు పలు రకాల చర్యలు చేపడుతున్నా.. కొందరి అవగాహనా రాహిత్యంతో పరిసరాలు చెత్తమయమవుతున్నాయి. విజయవాడ జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా కోర్టుల సమీపంలో బల్దియా అధికారులు చెత్తడబ్బాలు ఏర్పాటు చేశారు. కానీ పలువురు చెత్తను ఇలా కింద పడేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు పలు రకాల చర్యలు చేపడుతున్నా.. కొందరి అవగాహనా రాహిత్యంతో పరిసరాలు చెత్తమయమవుతున్నాయి. విజయవాడ జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా కోర్టుల సమీపంలో బల్దియా అధికారులు చెత్తడబ్బాలు ఏర్పాటు చేశారు. కానీ పలువురు చెత్తను ఇలా కింద పడేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు.
11/15
 ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పడినప్పుడు ఫ్రీలెఫ్ట్‌ బ్లాక్‌ చేయకుండా ట్రాఫిక్‌ పోలీసులు సూచనలు చేస్తున్నప్పటికీ పలువురు వాహనదారులు వినడం లేదు. హైదరాబాద్‌లోని ఐడీపీఎల్‌ సిగ్నల్స్‌ వద్ద ఫ్రీలెఫ్ట్‌ను బ్లాక్‌ చేయడంతో వెనక నిలిచిపోయిన కారు.

12/15
  హైదరాబాద్‌లోని  జగద్గిరిగుట్టపైకెక్కి చూస్తే ఓ దృశ్యం కనువిందు చేస్తోంది. ఓ వైపు నుంచి చూస్తే వరుసలో తెలంగాణ అమరుల స్మారకం, రాష్ట్ర నూతన సచివాలయం, బిర్లామందిర్, అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహం, ఎత్తైన జాతీయ జెండా కనిపిస్తుండగా.. మరో వైపు తిరిగి చూస్తే నగర భద్రత కోసం బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఠీవిగా కనిపిస్తోంది.

13/15
 మిట్ట మధ్యాహ్నం.. కాళ్లకు చెప్పులు లేకున్నా రోడ్ల పక్కన పారేసిన ఖాళీ బాటిళ్లు, అట్టముక్కలు ఏరుకుంటూ కనిపించింది. హైదరాబాద్‌లోని వారాసిగూడకు చెందిన 72 ఏళ్ల నరసమ్మ. పలుకరిస్తే తనకు వచ్చే వృద్ధాప్య పింఛను మందులకే సరిపోతోందని తెలిపింది. తన ఒక్కగానొక్క కూతుర్ని డబ్బులు అడగడం ఇష్టం లేక ఇలా ఏరుకుంటూ అమ్ముకుంటున్నానంది

14/15
మన జీవితంలో యోగాకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ సూర్య నమస్కారాల్లోని 12 భంగిమల బొమ్మలను  హైదరాబాద్‌లోని పుప్పాలగూడ-అల్కాపురి కాలనీ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేశారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం నుంచి 25 రోజులపాటు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి.

15/15
పంజాబ్‌కు చెందిన డాక్టర్‌ పవన్‌ ధింగ్రా (53) ఆర్థోపెడిక్‌ వైద్యుడు 66,600 కి.మీ. సైక్లింగ్‌ను పూర్తిచేసి ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు సాధించారు.

మరిన్ని