News in pics : చిత్రం చెప్పే విశేషాలు (24-03-2024/1)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 24 Mar 2024 10:28 IST
1/6
సాధారణంగా పక్షులు గడ్డి పోచలు, ఆకులతో గూళ్లు కట్టుకోవడం చూస్తుంటాం. దక్షిణ ఆసియాకు చెందిన స్ట్రీక్‌-థ్రోటెడ్‌ స్వాలో లేదా ఇండియన్‌ క్లిఫ్‌ స్వాలో అనే పక్షి.. భారతదేశం, నేపాల్‌, పాకిస్థాన్‌ దేశాలకు వలస వచ్చి నివాసం ఉంటున్నాయి. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని అందవెల్లి పెద్దవాగు వంతెనకు మట్టితో గూళ్లు కట్టుకొని జీవనం సాగిస్తున్నాయి. 

2/6
ఇది ఉప్పల్‌లోని నల్లచెరువు. అంతా గుర్రపుడెక్క పరుచుకుంది. మరోవైపు చెరువు నుంచి పారుతున్న కాలుష్య జలాల  దుర్వాసనతో స్థానికులు, అటుగా ప్రయాణించే వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

3/6
వాతావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్త్‌ అవర్‌లో భాగంగా శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు  విద్యుత్తు  సరఫరా నిలిపివేశారు. సచివాలయంతోపాటు ఐటీ కారిడార్‌లోని పలు భవనాల్లో విద్యుద్దీపాలు ఆపేయడంతో చీకట్లు అలుముకున్నాయి.

4/6

5/6
ప్రకృతిలో మోదుగు విరబూసి కనువిందు చేస్తోంది. మోదుగు పూసిందంటే..హోలీ వచ్చేసిందని సంకేతం. గ్రామాలలో మోదుగు వృక్షాలు ఎటు చూసినా విరబూసి ఆహ్లాదం  పంచుతున్నాయి. ఏడాదిలో కేవలం నెల రోజులు మాత్రమే పుష్పాలు ఆకర్షణగా నిలుస్తాయి.

6/6
జి.ఎడవల్లి నుంచి కనగల్లు వెళ్లే రహదారిలో ఇరువైపులా తరువులు ఏపుగా పెరిగి అల్లుకున్నాయి. చూపరులు, ప్రయాణికులకు ఆహ్లాదం పంచుతున్నాయి.  ప్రస్తుతం ఆకురాలి పలుచగా కనిపిస్తున్నా.. చిగురించి పచ్చగా మారితే దారికి పచ్చటి తోరణంగా ఉంటుంది.

మరిన్ని