దేశమంతా విస్తరిస్తాం.. భాజపాను ఢీకొడతాం

తాజా వార్తలు

Published : 08/06/2021 01:21 IST

దేశమంతా విస్తరిస్తాం.. భాజపాను ఢీకొడతాం

కోల్‌కతా: దేశంలోని ప్రతిమూలకూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని విస్తరిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ప్రకటించారు. అందుకు సంబంధించిన ప్రణాళికను కొన్ని నెలల్లో సిద్ధం చేయబోతున్నట్లు తెలిపారు. తాను ఎదగాలని భావిస్తున్న ప్రతి రాష్ట్రంలోనూ భాజపాను తృణమూల్‌ ఢీకొడుతుందని చెప్పారు. ఈ మేరకు అభిషేక్‌ బెనర్జీ మీడియాతో మాట్లాడారు.

భాజపా చేస్తున్న బంధుప్రీతి ఆరోపణలను అభిషేక్‌ ఖండించారు. ఒక కుటుంబం నుంచి ఒకరే రాజకీయాల్లో ఉండాలని ఒకవేళ పార్లమెంటులో చట్టం చేస్తే పార్టీ నుంచి వెంటనే వైదొలుగుతానని పేర్కొన్నారు. రాబోయే 20 ఏళ్లలో ఏ మంత్రి పదవినీ చేపట్టబోనని, పార్టీని వృద్ధిలోకి తీసుకురావడమే తన ముందున్న లక్ష్యమని వివరించారు. బెంగాల్‌లో భాజపాను ఓడించినందుకు తృణమూల్‌ను అభినందిస్తూ దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ఈ-మెయిల్స్‌ వచ్చాయని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని