Rahul Dravid: దాదా కూడా చెప్పేశాడు!
close

తాజా వార్తలు

Published : 15/06/2021 10:48 IST

Rahul Dravid: దాదా కూడా చెప్పేశాడు!

లంక పర్యటనకు కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌

ముంబయి: శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా ఉంటారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ద్రవిడ్‌తో కలిసి టి.దిలీప్‌, పరాస్‌ మహంబ్రే లంకకు వెళ్తారని సమాచారం. వీరంతా అండర్‌-19, భారత్‌-ఏ జట్లకు కోచులుగా పనిచేయడం గమనార్హం.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడేందుకు ఇప్పటికే టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. జూన్‌18న సౌథాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది. నెల రోజుల విరామం తర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసు ఆడనుంది. ఇదే సమయంలో మరో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. నిజానికి ఈ పరిమిత ఓవర్ల సిరీసు గతంలో ఆడాల్సింది. కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రత్యామ్నాయ ఆటగాళ్లు, టీ20 స్టార్లు అందుబాటులో ఉండటంతో రెండో జట్టును బీసీసీఐ ఎంపిక చేసి శిఖర్‌ ధావన్‌ను సారథిగా ప్రకటించింది.

లంక పర్యటనలో భారత్‌కు ద్రవిడ్‌ కోచ్‌గా ఉంటారని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. దాదాపుగా బీసీసీఐ వర్గాలూ ఇదే విషయం స్పష్టం చేశాయి. తాజాగా బోర్డు అధ్యక్షుడు గంగూలీ దీనిని ధ్రువీకరించారు. గతంలో అండర్‌-19, భారత్‌-ఏకు కోచ్‌గా మిస్టర్‌ డిపెండబుల్‌కు ఎంతో అనుభవం ఉంది. ఆటగాళ్లతో మంచి సాన్నిహిత్యం ఉంది. లంక పర్యటనకూ అప్పటి ఆటగాళ్లే ఎంపికవ్వడంతో ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించినట్టు తెలిసింది. టి.దిలీప్‌, పరాస్‌ మహంబ్రే సైతం ఆయనతో కలిసి పనిచేయడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని