తలంబ్రాలంటే ఏమిటి, ఎందుకు?

పసుపుతో కలిపిన బియ్యాన్ని వధూవరులు తల మీద పోసుకోవడం పెళ్లిలో వినోదాత్మకంగా సాగే సంప్రదాయం. ప్రాలు అంటే బియ్యం. తల మీద పోయడాన తలంబ్రాలు.

Published : 02 Dec 2021 01:58 IST

సుపుతో కలిపిన బియ్యాన్ని వధూవరులు తల మీద పోసుకోవడం పెళ్లిలో వినోదాత్మకంగా సాగే సంప్రదాయం. ప్రాలు అంటే బియ్యం. తల మీద పోయడాన తలంబ్రాలు. తలపైనున్న బ్రహ్మరంధ్రం మీద అక్షతలు పోసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. పురోహితుడు కొన్ని తలంబ్రాలను ఎండు కొబ్బరిచిప్పలోపోసి, కపిల గోవులను స్మరించి, పుణ్యకర్మలు చేస్తూ దానధర్మాలతో జీవనం సాగించాలని, శాంతి, పుష్టి, తుష్టి వృద్ధి చెందాలని, చేపట్టిన పనులకు ఆటంకాలు కలగకూడదని, ఆయురారోగ్యాలు, సకల శుభాలూ కలగాలని, చంద్ర నక్షత్రాల సాక్షిగా దాంపత్యం సవ్యంగా సాగుతూ సుఖశాంతులతో మెలగాలని.. మంత్రపఠనం చేసి వధూవరులు పరస్పరం తలమీద పోసుకునేలా చేస్తాడు. వరుడు ‘యజ్ఞోమేకామస్సమృధ్యతామ్‌’ అని మంత్రం చదివితే, వధువు పశువులు, పాడిపంటలూ సమృద్ధిగా ఉండాలంటుంది. తర్వాత ఇద్దరూ కలిసి సిరిసంపదలు సమృద్ధిగా ఉండాలని పఠిస్తారు. ఈ మంత్రాల్లో వ్యక్తిగత స్వార్థం కంటే విశ్వశ్రేయస్సే అధికం. ఎక్కువ ప్రాంతాల్లో తలంబ్రాల్లో బియ్యాన్నే వాడినప్పటికీ కొన్నిచోట్ల జొన్నలనూ వాడే సంప్రదాయం ఉంది. ఇప్పుడిప్పుడు ముత్యాలు, గాజు లేదా థర్మాకోల్‌ పూసలను తలంబ్రాలుగా పోసుకుంటున్నప్పటికీ అది సరదా మాత్రమే. అసలైన వేడుక అక్షతలతోనే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు