జ్యోతి స్వరూపంగా...

అనంతానికి చిహ్నమైన లింగంలో మహాశివుడు జ్యోతి స్వరూపంగా ఉంటాడు. ప్రతి లింగమూ పవిత్రమే అయినా ద్వాదశ జ్యోతిర్లింగాలు పరమపవిత్రం.

Published : 17 Nov 2022 00:37 IST

అనంతానికి చిహ్నమైన లింగంలో మహాశివుడు జ్యోతి స్వరూపంగా ఉంటాడు. ప్రతి లింగమూ పవిత్రమే అయినా ద్వాదశ జ్యోతిర్లింగాలు పరమపవిత్రం. వాటి గురించి అందరికీ తెలుసు కానీ ఆ జ్యోతిర్లింగాలకు 12 ఉప జ్యోతిర్లింగాలున్న సంగతి చాలామందికి తెలియదు. అవి వరుసగా... మహినది ప్రాంతంలోని అంతకేశ లింగం సోమనాథ జ్యోతిర్లింగానికి ఉప జ్యోతిర్లింగం. శ్రీశైల జ్యోతిర్లింగానికి ఉప లింగమైన రుద్రేశ్వర లింగం భృగు కక్ష్యలో ఉంది. నర్మదా తీరంలోని దుగ్ధేశ్వర లింగం మహాకాళేశ్వరునికి ఉప జ్యోతిర్లింగం. కేదారేశ్వరునికి యమునా తీరానున్న భూతేశ్వర లింగం, భీమశంకరుడికి సహ్యాద్రి పైనున్న భీమ వాయులింగం, నాగేశ్వర లింగానికి మల్లికా-సరస్వతి సంగమంలోని మహా భూతేశ్వర లింగం, రామేశ్వరునికి గుప్తేశ్వర లింగం, ఘుష్మేశ్వరునికి వ్యాఘ్రేశ్వర లింగం, బిందు సరోవరంలోని కర్దమేశునికి ఓంకారేశ్వర లింగం, త్రయంబకేశ్వరుడికి త్రయలింగం, ఓంకారేశ్వరునికి అమలేశలింగం, విశ్వేశ్వరుడికి సర్వేశ్వరలింగం ఉప జ్యోతిర్లింగాలుగా పూజలందుకుంటున్నాయి.

- పద్మజ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని