చేతికర్రే కాపాడుతుంది

ఇంద్ర యాగం ఆపిన కారణంగా ఉన్నట్టుండి గోకులాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. ఆ ప్రాంతం అంతా భయానకంగా మారింది.

Published : 23 Feb 2023 00:14 IST

ఇంద్ర యాగం ఆపిన కారణంగా ఉన్నట్టుండి గోకులాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. ఆ ప్రాంతం అంతా భయానకంగా మారింది. యాదవులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలితో ఎత్తి గొడుగులా పట్టు కున్నాడు. అందరూ కొండ కిందికి చేరిపోయారు. ఓ వృద్ధుడు చేతికర్రను కొండ కింద మోటించి ఊతంగా పెట్టి ‘కన్నయ్య పసివాడు, కొండేమో పెద్దది. ఇంత బరువు మోయలేక జారవిడిస్తే కష్టం కదా’ అన్నాడు. ‘అదే జరిగితే ఈ కర్ర కొండను నిలప గలుగుతుందా?’ అంటూ నవ్వారంతా. కానీ వృద్ధుడు పట్టించుకోలేదు. అతడికి కృష్ణుడి మీద కంటే తన చేతికర్ర మీదే నమ్మకం. ‘భగవంతుణ్ణి విశ్వసించి నిబ్బరంగా ఉంటే తప్పక రక్షణ లభిస్తుంది. మనకిక ఎలాంటి అనుమానం, చింతా అవసరం లేదు’ అంటూ నిశ్చింతగా కళ్లు మూసుకున్నాడు మరో వృద్ధుడు.

శివరాజేశ్వరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని