కృతజ్ఞః

విష్ణుసహస్రనామావళిలో ఇది 82వది. ‘కృతజ్ఞః’ అంటే చేసిన మేలును గుర్తు పెట్టుకోవటం.

Updated : 18 Jan 2024 04:39 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 82వది. ‘కృతజ్ఞః’ అంటే చేసిన మేలును గుర్తు పెట్టుకోవటం. నామస్మరణం, శరణాగతి, పూజాది కార్యక్రమాలతో ప్రసన్నుడై భక్తులను అనుగ్రహిస్తుంటాడు శ్రీమహా విష్ణువు. వాటన్నిటినీ గుర్తుంచుకుని భక్తులను కాచి కాపాడతాడు. పత్ర పుష్పాది చిరు నివేదనలకే సంతుష్టుడై కామితార్థ మోక్షాలను ప్రసాదిస్తుంటాడు కూడా. సమస్త ప్రాణుల పుణ్య, పాప కర్మలను గమనిస్తూ, అన్నిటినీ గుర్తుపెట్టుకుని వాటికి తగ్గ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు స్వామి. అందుకే సదా పుణ్యాలే చేస్తూ ఆ కృతజ్ఞుడి కరుణను పొందాలన్నది ఈ నామాంతర్గత సారం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని