ఆ ఒక్క రోజే దర్శనం
శిప్రా నదీ తీరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రం ఉజ్జయిని. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అమ్మవారు హరసిద్ధిగా, మహాకాళిగా భక్తులను అనుగ్రహిస్తుంది. పరమేశ్వరుడు మహాకాళేశ్వరుడిగా దర్శనమిస్తాడు. ఇక్కడి కాలభైరవస్వరూపం అద్వితీయమైనది. ఇన్ని విశిష్టతలున్న ఈ అవంతికా నగరంలో నాగపంచమినాడు నాగచంద్రేశ్వరుని దర్శించుకోవచ్చు. స్వామి నాగదోషాల్ని, కాలసర్పదోషాల్ని హరిస్తాడని ఆరోజు భక్తులు ఉజ్జయినికి తరలివస్తారు. కాళము అంటే సర్పం. సాధారణంగా సర్పాన్ని కాలానికి ప్రతీకగానూ చెబుతారు. కాలాన్ని, కాళుడిని(యముడు) ఆధీనంలో ఉంచుకున్న మహాకాళేశ్వరుని సేవించినవారికి అపమృత్యు భయం (అకాల మరణం) ఉండదంటారు. రుద్రసాగర సరస్సు సమీపాన మహాకాళుని ఆలయం ఉంది. మొదటి అంతస్థులో మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా దక్షిణాభిముఖంగానూ, రెండో అంతస్థులో ఓంకారేశ్వరునిగా తూర్పుముఖంగానూ, మూడో అంతస్థులో నాగచంద్రేశ్వరునిగా పశ్చిమాభిముఖంగా ఉన్న క్షేత్రం ఉజ్జయిని.
అరుదైన స్వామి రూపం.. విశిష్టతల సమాహారం
నవనాగుల్లో ఒకటైన తక్షకుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి అమరత్వాన్ని పొందాడు. ఏడాదికి ఒకసారైనా ఈశ్వరుడు తనను శయ్యగా చేసుకుని శయనించాలని తక్షకుడు వేడుకున్నందున, నాగపంచమినాడు ఈ క్షేత్రంలో ఆ కోరిక నెరవేరుస్తాడనేది పురాణకథనం. నాగపంచమినాడు నాగరాజు తక్షకుడు ఈ ఆలయంలో సంచరిస్తాడట. 11వ శతాబ్దంలో పరమారరాజు నేపాల్ నుంచి ఈ మూర్తిని తెచ్చి ప్రతిష్టించారని చారిత్రక ఆధారాలున్నాయి. సాధారణంగా కనిపించే లింగస్వరూపానికి భిన్నంగా నాగచంద్రేశ్వరుడు ఏడు పడగల తక్షకుణ్ణి ఆసనంగా చేసుకుని సతీసమేతంగా దర్శనమిస్తాడు. ఈ మూర్తిలోనే వినాయకుడు, కుమారస్వామి, పాదాల వద్ద శివపార్వతులు వాహనాలను చూడవచ్చు. ఈ ఆలయంలోకి నాగపంచమినాడు మాత్రమే భక్తులను అనుమతిస్తారు.
- గొడవర్తి శ్రీనివాసు, న్యూస్‌టుడే, ఆలమూరు
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- social look: లవ్‌లో పడిన రష్మి.. జిమ్‌లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన యశ్వంత్‌సిన్హా పర్యటన
- Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?
- IND vs ENG: యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసిన బుమ్రా
- Raghurama: రెండేళ్ల తర్వాత భీమవరం రానున్న రఘురామ.. అభిమానుల బైక్ ర్యాలీ