పితృదేవతలకు సంతృప్తి

భాద్రపద శుక్లపక్షాన్ని మహాలయ పక్షమంటారు. ఇది పితృకార్యాలకు పవిత్రమైంది. ఈ కాలంలో పుత్రులు లేదా పౌత్రులు సమర్పించే తర్పణాలతో పితృదేవతలు సంతృప్తి చెందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

Updated : 30 Sep 2021 06:05 IST

అక్టోబర్‌ 6 మహాలయ అమావాస్య

భాద్రపద శుక్లపక్షాన్ని మహాలయ పక్షమంటారు. ఇది పితృకార్యాలకు పవిత్రమైంది. ఈ కాలంలో పుత్రులు లేదా పౌత్రులు సమర్పించే తర్పణాలతో పితృదేవతలు సంతృప్తి చెందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. తర్పణాలు చనిపోయిన తండ్రికే పరిమితం కాదు. తల్లిదండ్రులు, వాళ్ల తల్లిదండ్రులు, అత్తమామలు, తోడబుట్టినవారు, జీవిత భాగస్వామి, స్నేహితులు, వారి ఆప్తులు, గురువులు, పిల్లలు లేని బంధు మిత్రులు... ఇలా ఎవరికైనా సరే తర్పణాలు విడువవచ్చు. ఇందువల్ల పైలోకాల్లో ఉన్న పితృ దేవతలకు ఆకలిదప్పులు తీరి తృప్తిచెందుతారని, అప్పుడే వారి వారసులకు సుఖసంతోషాలు అనుభూతికొస్తాయని నమ్ముతారు. శ్రాద్ధకర్మలు నిర్వహించిన పుత్రపౌత్రాదుల కుటుంబాలను మరణించిన పెద్దలు దీవిస్తారని, ఆ ఆశీర్వాదబలమే ఇహలోక కష్టాల నుంచి కాపాడుతుందని అంటారు. మన ధర్మశాస్త్రాలు భూత, మనుష్య, పితృ, దేవ, బ్రహ్మ అంటూ ఐదు రకాల యజ్ఞాలను సూచించాయి. వీటిల్లో పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహించే పితృయజ్ఞం ముఖ్యమైంది. ‘శ్రద్ధయా దీయతే ఇతి శ్రాద్ధం’ అన్నారు. అంటే శ్రద్ధగా చేసేదే శ్రాద్ధకర్మ. ఆయా కర్మలు చనిపోయిన తిథుల ప్రకారం నిర్వహించినా మహాలయ అమావాస్య నాడు చేయడం మరీ శ్రేష్ఠం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని