AP News: టెట్‌, టీఆర్టీ పరీక్ష షెడ్యూల్‌ మార్చండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఏపీలో జరుగుతోన్న టెట్‌, టీఆర్టీ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను మార్చాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

Updated : 04 Mar 2024 16:07 IST

అమరావతి: ఏపీలో జరుగుతోన్న టెట్‌, టీఆర్టీ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను మార్చాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని, రాత పరీక్ష తర్వాత ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణకూ సమయం ఇవ్వాలని సూచించింది. 2018లో జరిగిన టెట్‌, టీఆర్టీ మధ్య తగిన సమయం ఇచ్చారని, ఇప్పుడు మాత్రం హడావిడిగా నిర్వహిస్తున్నట్లుగా ఉందని కోర్టు అభిప్రాయపడింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని