నోటిఫికేషన్స్

పంజాబ్‌ రాష్ట్రం చండీగఢ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Published : 03 Nov 2022 00:18 IST

ఉద్యోగాలు

256 గ్రూప్‌ ఎ,బి,సి కొలువులు

పంజాబ్‌ రాష్ట్రం చండీగఢ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 256.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 12వ తరగతి, ఎంబీబీఎస్‌, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
వయసు: ఏఏవో పోస్టులకు 18-40 ఏళ్లు, నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు 18-35 ఏళ్లు మిగిలిన పోస్టులకు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.1500 (ఎస్సీ, ఎస్టీలకు రూ.800, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది).
ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 28-11-2022.
వెబ్‌సైట్‌: https://pgimer.edu.in/ 


ఐటీబీపీలో 287 కానిస్టేబుల్‌/ ట్రేడ్స్‌మెన్‌ పోస్టులు

భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) కానిస్టేబుల్‌/ ట్రేడ్స్‌మెన్‌ గ్రూప్‌ ‘సి’ నాన్‌ గెజిటెడ్‌ (నాన్‌-మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. కానిస్టేబుల్‌(టైలర్‌, గార్డెనర్‌, కోబ్లర్‌): 65 పోస్టులు
2. కానిస్టేబుల్‌(సఫాయి కరంచారీ, వాషర్‌మన్‌, బార్బర్‌): 222 పోస్టులు
అర్హత: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు.
వయసు: 30-11-2022 నాటికి టైలర్‌, గార్డెనర్‌, కోబ్లర్‌ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్లు; సఫాయ్‌ కరంచారీ, వాషర్‌మ్యాన్‌, బార్బర్‌ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌- సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది).
ఎంపిక: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 23.11.2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22.12.2022.
వెబ్‌సైట్‌: https://itbpolice.nic.in/


వైజాగ్‌ స్టీల్‌లో ఆపరేటర్‌-కమ్‌-మెకానిక్‌లు

రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు చెందిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జగ్గయ్యపేటలోని జగ్గయ్యపేట లైమ్‌స్టోన్‌ మైన్స్‌, తెలంగాణ రాష్ట్రం మాధారంలోని మాధారం డోలమైట్‌ మైన్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  
1. మైన్‌ ఫోర్‌మ్యాన్‌: 02 పోస్టులు
2. ఆపరేటర్‌-కమ్‌-మెకానిక్‌: 19 పోస్టులు
3. మైన్‌ మేట్‌: 04 పోస్టులు
4. బ్లాస్టర్‌: 02 పోస్టులు
5. డ్రిల్‌ టెక్నీషియన్‌: 04 పోస్టులు
మొత్తం ఖాళీలు: 31.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, డిప్లొమా, డ్రైవింగ్‌ లైసెన్స్‌, సర్టిఫికెట్‌ కోర్సుతోపాటు సంబంధిత అనుభవం.
వయసు: 01-10-2022 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: పోస్టును అనుసరించి రాత పరీక్ష, జాబ్‌ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16.11.2022.
వెబ్‌సైట్‌: https://www.vizagsteel.com/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని