ఫ్రాన్స్‌లో మన రాయబారి?

పోటీ పరీక్షల్లో వర్తమాన అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వీటిని విద్యార్థులూ, ఉద్యోగార్థులూ ఎప్పటికప్పుడు గమనిస్తూ గుర్తుంచుకోవాలి....

Published : 02 Mar 2020 00:16 IST

జాతీయం
పోటీపరీక్షలకు వర్తమాన అంశాలు

పోటీ పరీక్షల్లో వర్తమాన అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వీటిని విద్యార్థులూ, ఉద్యోగార్థులూ ఎప్పటికప్పుడు గమనిస్తూ గుర్తుంచుకోవాలి.

1. ‘ఆసియా కీటక పరపరాగ సంపర్క పరిరక్షణ సదస్సు’ను 2020 ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు ఎక్కడ నిర్వహించారు? (1992 నాటి జీవ వైవిధ్య ఒప్పందం జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పరపరాగ సంపర్క కీటకాల సంరక్షణకు పరిశోధకులు ఉపక్రమించాలని వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో సాటి ఆసియా దేశాల్లోని పరిశోధకులతో చేయి కలపాలని నిర్ణయించిన భారత్‌ ఈ సదస్సును నిర్వహించింది. భారత జంతు శాస్త్ర సంఘం సహకారంతో కలకత్తా విశ్వవిద్యాలయం, బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, బెంగళూరులోని జాతీయ జీవశాస్త్ర అధ్యయన కేంద్రాలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి.)
1) దిల్లీ   2) బెంగళూరు  
3) కోల్‌కతా   4) లఖ్‌నవూ

2. ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? (ఈయన ఇప్పటివరకూ సింగపూర్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేశారు. ఫ్రాన్స్‌లో రాయబారి వినయ్‌ మోహన్‌ క్వత్రా నేపాల్‌ రాయబారిగా నియమితులయ్యారు.)
1) ఖలీల్‌ అహ్మద్‌ 2) జావెద్‌ అష్రాఫ్‌
3) మహ్మద్‌ అఖ్తర్‌ 4) అరుణ్‌ మిశ్రా

3. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2020 ఫిబ్రవరి 24న రెండు రోజుల భారత పర్యటన కోసం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్‌ బృందానికి స్వయంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి వీరు సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. బి) సబర్మతి ఆశ్రమం నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించిన ట్రంప్‌, మోదీ ప్రపంచంలోనే అతిపెద్ద మోతెరా స్టేడియంకు చేరుకుని ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ట్రంప్‌ 27 నిమిషాల పాటు ప్రసంగించారు. అనంతరం భార్య మెలనియా, కుమారై ఇవాంకా, అల్లుడు కుష్నర్‌తో కలసి డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఆపై ట్రంప్‌ బృందం దిల్లీ చేరుకుంది. సి) ఫిబ్రవరి 25న డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు రాష్ట్రపతి భవన్‌ చేరుకోగా వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధికారిక స్వాగతం పలికారు. వీరు రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత గాంధీకి ఘన నివాళులు అర్పించారు. డి) డొనాల్డ్‌ ట్రంప్‌ హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధానితో సమావేశమై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య సుమారు రూ.21,500 కోట్ల విలువైన రక్షణ ఒప్పందం ఖరారైంది. చమురు, ఆరోగ్య రంగాల్లో మూడు ఎంఓయూలు కుదిరాయి. రాష్ట్రపతి భవన్‌లో విందు చేసి ట్రంప్‌ బృందం అమెరికాకు తిరుగు ప్రయాణమైంది.
1) ఎ, బి మాత్రమే
2) ఎ, బి, సి మాత్రమే
3) ఎ, సి మాత్రమే 4) పైవన్నీ

జవాబులు:
1-3, 2-2, 3-4
- సీహెచ్‌. కృష్ణప్రసాద్‌
ఇతర వర్తమాన అంశాలను w
ww.eenadupratibha.net లో చూడండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని