సైన్స్‌లో ఏ పీజీ?

డిగ్రీ (బీజడ్‌సీ) పూర్తిచేశాను. నాకున్న ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలేంటి? - హరీష్‌ వర్మ

Updated : 12 Apr 2021 01:29 IST

డిగ్రీ (బీజడ్‌సీ) పూర్తిచేశాను. నాకున్న ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలేంటి?

- హరీష్‌ వర్మ

మీరు బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్‌, మైక్రో బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌, ఇమ్యునాలజీలలో ఏదో ఒకదానిలో పీజీ చేయవచ్చు.  ముందుగా మీరు ఏ సబ్జెక్టులో పీజీ చేయాలనుకొంటున్నారో నిర్ణయించుకోండి. సాధారణంగా అన్ని  విశ్వవిద్యాలయాలూ ఎంట్రన్స్‌ పరీక్షల ద్వారానే ప్రవేశాలను పూర్తి చేస్తున్నాయి. కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ పీహెచ్‌డీ కోర్సు కూడా అందిస్తునాయి. లైఫ్‌ సైన్సెస్‌లో పీజీ చేసినవారికి బోధన, పరిశోధన సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. పీజీ చేశాక బీఈడీ చేసి 11, 12 తరగతులు బోధించే పీజీ టీచర్‌ ఉద్యోగాన్ని పొందవచ్చు. బీఈడీ లేకుండా జూనియర్‌ కళాశాలల్లో బోధన వృత్తిని చేపట్టవచ్చు. నెట్‌ లేదా సెట్‌ లో ఉత్తీర్ణత సాధిస్తే డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా ఉపాధి పొందటానికి వీలుంటుంది. పీహెచ్‌డీ చేసి యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల కోసం, కేంద్రీయ, రాష్ట్రీయ పరిశోధన సంస్థల్లో సైంటిస్ట్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ప్రైవేటు రంగానికొస్తే ఫార్మా, బయోటెక్‌ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. అగ్రికల్చర్‌లో పీజీ చేయాలంటే డిగ్రీలో అగ్రికల్చర్‌ కచ్చితంగా చదివివుండాలి. మైక్రో బయాలజీ సబ్జెక్టులో పీజీ చేసినవారికి అగ్రికల్చర్‌లో పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది.  

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని