ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌లో పీజీ

ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ ఎక్కడ ఉంది? ఈ రంగంలో మహిళలకు అవకాశాలు ఎలా ఉంటాయి?

Published : 14 Jun 2021 01:10 IST

ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ ఎక్కడ ఉంది? ఈ రంగంలో మహిళలకు అవకాశాలు ఎలా ఉంటాయి?

-ఆశ్రిత

ఐటీ హైదరాబాద్‌, ఐఐటీ తిరుపతి, ఎన్‌ఐటీ వరంగల్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ కాకినాడ, కేఎల్‌ యూనివర్సిటీల్లో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ కోర్సు అందుబాటులో ఉంది. వీటితో పాటు కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలూ ఈ కోర్సును అందిస్తున్నాయి. చాలా విద్యాసంస్థల్లో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ చదవాలంటే బీఈ/ బీటెక్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ కచ్చితంగా చదివి ఉండాలన్న నిబంధన ఉంది. జీఏంఆర్‌ఐటీ రాజంలో ఈ కోర్సును కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం వారు అందిస్తున్నారు.
ఈ కోర్సు చదివిన తరువాత పురుషులకూ, మహిళలకూ ఉద్యోగావకాశాలు సమానమే. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ కోర్సు చదివినవారికి కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఎక్స్‌పర్ట్‌, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఇంజినీర్‌, ఎన్విరాన్‌మెంటల్‌ కన్సల్టెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ డిజైన్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు వస్తాయి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని