ఎంటెక్‌ ఒకటే మార్గమా?

మా అబ్బాయి ఇంజినీరింగ్‌ (ఈసీఈ) పూర్తిచేశాడు. తర్వాత ఎంటెక్‌ ఒకటే మార్గమా?సాధారణంగా ఏ బ్రాంచితో ఇంజనీరింగ్‌ చేసినవారికైనా కనీసం నాలుగు అవకాశాలు ఉంటాయి...

Updated : 30 Aug 2021 06:17 IST

మా అబ్బాయి ఇంజినీరింగ్‌ (ఈసీఈ) పూర్తిచేశాడు. తర్వాత ఎంటెక్‌ ఒకటే మార్గమా?

- కె. విజయ్‌కుమార్‌

* సాధారణంగా ఏ బ్రాంచితో ఇంజనీరింగ్‌ చేసినవారికైనా కనీసం నాలుగు అవకాశాలు ఉంటాయి. మొదటిది- వారికి సంబంధించిన బ్రాంచిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కోర్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం. రెండోది- ఐటీ/ సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళ్ళడం. మూడోది- సొంతంగా ఒక సంస్థ స్థాపించడం. నాలుగోది- ఉన్నత విద్యను అభ్యసించడం. వీటితో పాటు డిగ్రీ అర్హతతో పోటీ పరీక్షలు రాయడమూ మరొక మార్గం. ఇక మీ అబ్బాయి విషయానికొస్తే పైన చెప్పిన ఐదు అవకాశాల్లో తనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోమని చెప్పండి. ఇటీవలి కాలంలో చాలా ప్రభుత్వరంగ సంస్థలు గేట్‌ ద్వారా నియామకాలు చేస్తున్నాయి. మీ అబ్బాయిని గేట్‌ రాయమని చెప్పండి. గేట్‌ ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీల్లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌ చేసే అవకాశం ఉంది. క్యాట్‌ రాసి ఐఐఎంల్లాంటి విద్యాసంస్థల్లో ఎంబీఏ చేయవచ్చు. క్యాట్‌లో మంచి స్కోర్‌ రాకపోతే, వివిధ ప్రైవేటు మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు నిర్వహించే ప్రత్యేకమైన ప్రవేశ పరీక్షల ద్వారా ఆయా సంస్థల్లో కూడా ఎంబీఎ చేయవచ్చు. జీఆర్‌ఈ, టోఫెల్‌ల ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కూడా ఉన్నాయి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని