విదేశాల్లో పరిశోధన ఎలా?

ఎంఫార్మసీ చేశాను. యూఎస్‌ఏ, కెనడాల్లో పీహెచ్‌డీ చేయాలంటే ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుందా? - కొండా బనవతు

Published : 08 Nov 2021 00:37 IST

ఎంఫార్మసీ చేశాను. యూఎస్‌ఏ, కెనడాల్లో పీహెచ్‌డీ చేయాలంటే ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుందా?

 - కొండా బనవతు

* ప్రస్తుతం ఫార్మసీలో బోధన/ పరిశోధనలకు చాలా అవకాశాలున్నాయి. మీరు నిరభ్యంతరంగా విదేశాల్లో పీహెచ్‌డీ చేయవచ్చు. అమెరికా, కెనడాల్లో పరిశోధన చేయాలంటే, ముందుగా ఏయే యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ చేయాలనుకొంటున్నారో, ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్స్‌ ద్వారా ప్రవేశ నియమాలను చూడండి. ఒక్కో యూనివర్శిటీ ఒక్కో విధమైన పద్ధ్దతి పాటిస్తుంది. సాధారణంగా విదేశీ విద్యాలయాలు పీహెచ్‌డీ ప్రవేశాలను చాలా జాగ్రత్తగా నిర్వహిస్తాయి. డిగ్రీ, పీజీలతో పోలిస్తే, పీహెచ్‌డీకి అతి తక్కువ సీట్లు ఉంటాయి. ఇంగ్లిష్‌ భాషలో అవగాహన నిరూపించుకోవటానికి టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ రాయవలసి ఉంటుంది. ఆప్టిట్యూడ్‌ని పరీక్షించడం కోసం జీఆర్‌ఈ పరీక్ష స్కోరును చూస్తారు. మరికొన్ని యూనివర్సిటీలు విద్యార్థి విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి సబ్జెక్టు జీఆర్‌ఈ స్కోర్‌ పరిగణనలోకి తీసుకొంటాయి. కొన్ని యూనివర్సిటీలు జీఆర్‌ఈతో సంబంధం లేకుండా కూడా ప్రవేశాలు కల్పిస్తాయి. గత అకడెమిక్‌ పెర్ఫార్మెన్స్‌, కనీసం రెండు రెఫరెన్స్‌ లెటర్స్‌, పీహెచ్‌డీ చేయాలనుకొంటున్న అంశం, పరిశోధన ఎందుకు చేయాలనుకొంటున్నారో తెలిపే స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, గతంలో ప్రచురించిన పరిశోధన పత్రాలు.. ఇవన్నీ పీహెచ్‌డీ ప్రవేశం సానుకూలం చేసేలా ప్రభావితం చేస్తాయి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని