ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను మహబూబాబాద్‌ జిల్లా వాసిని. ఒకటి నుంచి పదో తరగతి వరకు జనగాంలో చదివాను. ఈ రెండు ప్రాంతాలు  వేర్వేరు జోన్‌లలో ఉన్నాయి. నివాసం లేదా చదువుకున్న స్థలం ఆధారంగా నేను ఏ జోన్‌ కిందకు వస్తానో తెలియజేయండి....

Updated : 22 Apr 2022 06:34 IST

నేను మహబూబాబాద్‌ జిల్లా వాసిని. ఒకటి నుంచి పదో తరగతి వరకు జనగాంలో చదివాను. ఈ రెండు ప్రాంతాలు  వేర్వేరు జోన్‌లలో ఉన్నాయి. నివాసం లేదా చదువుకున్న స్థలం ఆధారంగా నేను ఏ జోన్‌ కిందకు వస్తానో తెలియజేయండి.

- భూక్య

జ: జనగాం జిల్లా ఏ జోన్‌ పరిధిలోకి వస్తే మీరు అదే జోన్‌ కిందకు వస్తారు.


గ్రూప్‌ - 2 లో కొన్ని పోస్ట్‌లకు బీఏ అర్హత ఉంది. నేను బీఫార్మసీతో పాటు దూరవిద్యలో బీఏ చేశాను. టీఎస్‌పీఎస్సీ రిజిస్ట్రేషన్‌లో అర్హత దగ్గర బీఫార్మసీ అని పెట్టాను. బీఏ అర్హత ఉన్న పోస్టులకు ఎంపికైతే ఎలా? ఓటీఆర్‌ రిజిస్ట్రేషన్‌ ఇంకా అప్‌లోడ్‌ చేయలేదు. ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయండి.      

- శ్రీలక్ష్మి

జ: గ్రూప్‌ - 2 పోస్టులకు ఏదైనా డిగ్రీ పట్టా ఉన్నవారు అర్హులు. మీరు చదివిన బీఫార్మసీ డిగ్రీ కిందకే వస్తుంది కాబట్టి అన్ని పోస్టులకు పోటీ పడొచ్చు.


నేను ఎస్‌ఐ ఉద్యోగానికి ఎలా ప్రిపేర్‌ కావాలి? ఏయే సబ్జెక్టులపై పట్టు సాధించాలో తెలియజేయండి.

- పుష్ప

జ: ఎస్‌ఐ ఉద్యోగానికి జనరల్‌ స్టడీస్‌ అంశాలను బాగా చదవాలి. మ్యాథ్స్‌, ప్యూర్‌ మ్యాథ్స్‌, అరిథ్‌మెటిక్‌పై పట్టు సాధించడం పరీక్ష ప్రిపరేషన్‌లో కీలకమైన అంశం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని