ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

మూడో తరగతి వరకు వరంగల్‌ జిల్లాలో చదివాను. నాలుగో తరగతి నుంచి డిగ్రీ వరకు కరీంనగర్‌లో విద్యాభ్యాసం జరిగింది. నేను ఏ జిల్లా స్థానికత పొందుతాను?

Published : 27 Apr 2022 06:08 IST

మూడో తరగతి వరకు వరంగల్‌ జిల్లాలో చదివాను. నాలుగో తరగతి నుంచి డిగ్రీ వరకు కరీంనగర్‌లో విద్యాభ్యాసం జరిగింది. నేను ఏ జిల్లా స్థానికత పొందుతాను?

- ఒక విద్యార్థి

జ: ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏడో తరగతి వరకు నాలుగేళ్లు వరుసగా ఏ ప్రాంతంలో చదివితే ఆ జిల్లా స్థానికత పొందుతారు. మీరు నాలుగో తరగతి నుంచి ఏడో తరగతి వరకు  కరీంనగర్‌లో చదివారు కాబట్టి అదే జిల్లా స్థానికత కిందకు వస్తారు. 


నా స్నేహితుడు కిరణ్‌ ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఓపెన్‌ స్కూల్‌లో ఇంటి నుంచి చదువుకున్నాడు (ఆరోగ్య సమస్య కారణంగా). అయిదో తరగతి నుంచి బీటెక్‌ వరకు హన్మకొండలో చదివాడు. అతడు పుట్టినప్పటి నుంచి హన్మకొండలోనే ఉన్నాడు. రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ తీసుకుందామంటే 6 నెలల కాలానికే ఇస్తున్నారు. ఒకటి నుంచి నాలుగో తరగతికి సంబంధించి నివాస ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవడం ఎలా? ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు గ్యాప్‌ సర్టిఫికెట్‌ తీసుకోవచ్చా? 

- ఒక విద్యార్థి

జ: రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ ఎందుకు కావాలో పూర్తి వివరాలను చెప్పాల్సి ఉంటుంది. ఓపెన్‌ స్కూల్‌కి సంబంధించి నాలుగేళ్లకు ధ్రువీకరణ పత్రం కావాలని అడిగితే కచ్చితంగా ఇస్తారు.  గ్యాప్‌ సర్టిఫికెట్‌ తీసుకుంటే మీరు నాన్‌-లోకల్‌ కిందకు వస్తారు. కాబట్టి మీరు రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ తీసుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని