ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

జూన్‌ మొదటివారంలో ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు పూర్తవుతాయి. నాకు గ్రూప్‌-4 రాసుకోవడానికి అర్హత ఉందా?

Published : 30 May 2022 01:06 IST

* జూన్‌ మొదటివారంలో ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు పూర్తవుతాయి. నాకు గ్రూప్‌-4 రాసుకోవడానికి అర్హత ఉందా?

- దుర్గాప్రసన్న

జ: నోటిఫికేషన్‌ విడుదలయ్యే సమయానికి ఇంటర్‌ పరీక్ష ఉత్తీర్ణులైన సర్టిఫికెట్‌ మీ చేతిలో ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.


* తెలంగాణలో ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు చదివి, ఆంధ్రప్రదేశ్‌లో అయిదో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివితే టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయడానికి తెలంగాణ స్థానికత వర్తిస్తుందా?

- వనజ

జ: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయడానికి మీకు ఇక్కడి స్థానికత వర్తించదు.


మా అబ్బాయి ఒకటో తరగతి నుంచి నాలుగో   తరగతి వరకు హైదరాబాద్‌లో, అయిదో తరగతి ఖమ్మం, ఆరో తరగతి హైదరాబాద్‌, ఏడు నుంచి పదో తరగతి రంగారెడ్డిలో చదివాడు. ఏ జిల్లాలో  స్థానికతను పొందుతాడు?

- హుక్యా

జ: మీ అబ్బాయి హైదరాబాద్‌లో స్థానికతను పొందుతాడు.


* ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు మహారాష్ట్రలో చదివి, ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలంగాణలో చదివాను. నాకు తెలంగాణ రాష్ట్ర స్థానికత వర్తిస్తుందా?

- బీతం అశీష్‌

జ: ప్రాథమిక విద్య అంతా మరొక రాష్ట్రంలో జరగడం వల్ల మీకు తెలంగాణ స్థానికత వర్తించదు.


మీ సందేహాలను పోస్ట్‌ చేయడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.
help@eenadupratibha.net


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని