ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

టీఎస్‌పీఎస్సీ టైపిస్ట్‌ పోస్టులకు లోయర్‌ ఇంగ్లిష్‌   (30 WPM) సర్టిఫికెట్‌ సరిపోతుందా?

Published : 05 Jun 2022 00:19 IST

టీఎస్‌పీఎస్సీ టైపిస్ట్‌ పోస్టులకు లోయర్‌ ఇంగ్లిష్‌   (30 WPM) సర్టిఫికెట్‌ సరిపోతుందా?

    - జీవన్‌

టీఎస్‌పీఎస్సీ టైపిస్ట్‌ పోస్టులకు లోయర్‌ ఇంగ్లిష్‌ (30 WPM) సర్టిఫికెట్‌ సరిపోతుంది.


నేను ఒకటి నుంచి రెండో తరగతి వరకు కరీంనగర్‌ జిల్లాలో; నాలుగు, అయిదు తరగతులు పెద్దపల్లిలో; ఆరో తరగతి కరీంనగర్‌లో; ఏడో తరగతి సిద్దిపేట జిల్లాలో చదివాను. నేను ఏ జిల్లాలో స్థానికత పొందుతాను?  

  - సురేష్‌

మీరు సిద్దిపేటలో స్థానికతను పొందుతారు.


నేను 2009 నుంచి స్టేట్‌ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. 1980 ఆగస్టు 13న జన్మించాను. డీఎస్‌పీ పోస్టుకు అర్హత ఉంటుందా?  

     - అని

మీరు ఏదైనా రిజర్వేషన్‌ను కలిగి ఉండి, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్‌లోనూ ఏజ్‌ రిలాక్సేషన్‌ కలిగి ఉంటే డీఎస్‌పీ పోస్టుకు అర్హత ఉంటుంది.


టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో ఎకానమీ, పాలిటీ విభాగాలకు కోచింగ్‌ లేకుండా ప్రిపేర్‌ కావచ్చా?

  - రసగ్నా

మీకు సబ్జెక్టుపై అవగాహన, ఆసక్తి ఉంటే సొంతంగా ప్రిపేర్‌ కావచ్చు. ప్రామాణిక పుస్తకాలను  చదవాలి. ఆన్‌లైన్‌ తరగతులనూ ఉపయోగించుకోవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని