ఎంపీసీతో అగ్రికల్చర్‌ కోర్సు?

ఇంటర్‌ (ఎంపీసీ) పాసయ్యాను. బీఎస్సీ అగ్రికల్చర్‌ చదవడానికి అవకాశం ఉంటుందా?

Updated : 15 Aug 2022 06:53 IST

ఇంటర్‌ (ఎంపీసీ) పాసయ్యాను. బీఎస్సీ అగ్రికల్చర్‌ చదవడానికి అవకాశం ఉంటుందా?

- వినయ్‌కుమార్‌

* రెండు తెలుగు రాష్ట్రాల్లో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సు ప్రవేశ పరీక్ష రాయాలంటే ఇంటర్‌లో బైపీసీ చదివి ఉండాలి. కానీ ఐసీఏఆర్‌ వారు నిర్వహించే ఏఐఈఈఏ పరీక్షకు ఇంటర్‌లో ఎంపీసీ చదివినవారు కూడా అర్హులే. ఈ పరీక్షలో మెరుగైన ర్యాంకు సాధించినవారు నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ -కర్నాల్‌, రాణి లక్ష్మీబాయి సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ-ఝాన్సీ, డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ- పూసాల్లో 100% సీట్లతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ యూనివర్సిటీల్లో  15% సీట్ల కోసం పోటీపడి ప్రవేశం పొందొచ్చు. మీరు ఇంటర్‌లో బయాలజీ చదవలేదు కాబట్టి అగ్రికల్చర్‌ కోర్సులో చేరేముందు బయాలజీ, అగ్రికల్చర్‌ సబ్జెక్టుల్లోని ప్రాథ]మిక విషయాలపై అవగాహన పెంచుకోండి.                 

 - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని