ఏ కోర్సు మెరుగు?

బీఎస్సీ (ఎంపీసీఎస్‌) పాసయ్యాను. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాలంటే.. ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ లేదా ఎంసీఏ- ఏది మంచిది? బీఎస్సీ (ఎంపీసీఎస్‌), బీటెక్‌ (సీఎస్‌ఈ), ఎంసీఏ..

Published : 18 Aug 2022 01:21 IST

బీఎస్సీ (ఎంపీసీఎస్‌) పాసయ్యాను. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాలంటే.. ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ లేదా ఎంసీఏ- ఏది మంచిది? బీఎస్సీ (ఎంపీసీఎస్‌), బీటెక్‌ (సీఎస్‌ఈ), ఎంసీఏ.. ఈ మూడు కోర్సుల్లో ఏది చదివితే త్వరగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పొందొచ్చు?

- బి.వీరారెడ్డి, కడప

* బీఎస్సీ (ఎంపీసీఎస్‌) తరువాత ఎంసీఏ చదివితే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఎంసీఏ కోర్సులో కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ చదివితే ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో థియరీతో పాటు హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ల గురించి ఎక్కువగా నేర్చుకుంటారు. మీకు లాజిక్‌, అల్గారిథమ్స్‌ల్లో గట్టి పట్టుండి, బోధన/పరిశోధన రంగంపై ఆసక్తి ఉంటే ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు ఎంచుకోండి. బీఎస్సీ (ఎంపీసీఎస్‌), బీటెక్‌ (సీఎస్‌ఈ), ఎంసీఏ..ఈ మూడు కోర్సులూ ఉపయోగకరమైనవే. దేని ప్రాధాన్యం దానిదే. బీటెక్‌ (సీఎస్‌ఈ) చదివినవారికి త్వరగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వస్తుంది కానీ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం పొందాలంటే డిగ్రీ మాత్రమే ఉంటే సరిపోదు. విషయ పరిజ్ఞానం, లాజికల్‌ థింకింగ్‌, అనలిటికల్‌ థింకింగ్‌, ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్‌, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లాంటివి ఉద్యోగావకాశాలను నిర్ణయిస్తాయి. వీటితోపాటు మీరు చదువుకొన్న విద్యాసంస్థ ర్యాంకింగ్‌, విశ్వసనీయత, ప్రాంగణ నియామకాలు కూడా మీరు త్వరగా ఉద్యోగం పొందడంలో ఉపయోగపడతాయి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని