ఒకేసారి రెండు డిగ్రీలు?

బీఈడీ మొదటి సంవత్సరం (బయాలజీ, ఇంగ్లిష్‌, మెథడాలజీ) రెగ్యులర్‌గా చదువుతున్నాను. దీంతోపాటు దూరవిద్యలో ఎంఏ చదవాలనుకుంటున్నాను.

Published : 12 Oct 2022 00:35 IST

బీఈడీ మొదటి సంవత్సరం (బయాలజీ, ఇంగ్లిష్‌, మెథడాలజీ) రెగ్యులర్‌గా చదువుతున్నాను. దీంతోపాటు దూరవిద్యలో ఎంఏ చదవాలనుకుంటున్నాను. ఒకే ఏడాది రెండు డిగ్రీలు చదివితే ప్రభుత్వ ఉద్యోగ సాధనలో ఏమైనా ఇబ్బంది ఉంటుందా?

- ఎన్‌.చైతన్య

* యూజీసీ ఇటీవల జారీ చేసిన రెగ్యులేషన్స్‌ ప్రకారం ఒకే సమయంలో ఒక డిగ్రీని రెగ్యులర్‌ పద్ధతిలో, మరో డిగ్రీని ఆన్‌లైన్‌/ డిస్టెన్స్‌/ ఓపెన్‌ పద్దతిలో చేయవచ్చు. కానీ బీఈడీ కోర్సు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నియంత్రణలో ఉన్నందువల్ల వారి మార్గదర్శకాలు అనుసరించవలసి ఉంటుంది. ఎన్‌సీటీఈ సంస్థ ఇప్పటివరకు డీ…ఈడీ/బీఈడీ/ ఎంఈడీలతో పాటు మరో డిగ్రీ చేయవచ్చనే విషయాన్ని చెప్పలేదు కాబట్టి, మీరు బీఈడీ పూర్తిచేసిన తరువాతే, ఎంఏ చదవండి. బీఈడీ ప్రొఫెషనల్‌ కోర్సు కాబట్టి, మీరు బీఈడీపై శ్రద్ధ పెట్టి, ఆ కోర్సులో సరైన శిక్షణ పొందండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని