పీజీటీకి అర్హత ఉందా?

బీఈడీని రెగ్యులర్‌గానూ (2019-2021), పీజీని దూరవిద్యలోనూ (2020-2022) చేశాను. పీజీటీకి అర్హురాలిని కానని కొందరంటున్నారు.

Published : 20 Feb 2024 00:19 IST

బీఈడీని రెగ్యులర్‌గానూ (2019-2021), పీజీని దూరవిద్యలోనూ (2020-2022) చేశాను. పీజీటీకి అర్హురాలిని కానని కొందరంటున్నారు. డీఎస్సీలో నాకు అర్హత ఉంటుందా?

 బి.నీలిమ 

కే సమయంలో రెండు డిగ్రీలు చదివితే, ఆ రెండు డిగ్రీలూ చెల్లుబాటు అవుతాయా? అనే సందేహం చాలా సంవత్సరాలుగా చాలామందిని వేధిస్తూనే ఉంది. ఈ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఏక కాలంలో రెండు డిగ్రీలు చదవడానికి వెసులుబాటు కల్పించే నిబంధనలను యూజీసీ 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో కొన్ని నియామక సంస్థలు రెండు డిగ్రీలు ఏక కాలంలో చదివినప్పటికీ, అవి ఒకటి రెగ్యులర్‌, మరొకటి దూరవిద్య ద్వారా అయితే ఆ రెండు డిగ్రీలనూ పరిగణనలోకి తీసుకొనేవి, ఉద్యోగావకాశాలు కల్పించేవి. కొన్ని సందర్భాల్లో మాత్రం దరఖాస్తు నింపేటప్పుడు రెండు డిగ్రీలు చదివిన కాలాన్ని ఒకే సంవత్సరంలో పేర్కొంటే, కంప్యూటర్‌ పోర్టల్‌లో ఎర్రర్‌ మెసేజ్‌ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు యూజీసీ అధికారికంగా అనుమతి ఇచ్చినందున భవిష్యత్తులో ఈ  సమస్య కూడా పరిష్కారం కావొచ్చు. మీరు టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉంటే, స్కూల్‌ అసిస్టెంట్‌, పీజీటీ ఉద్యోగాలకు అర్హురాలిని అన్న నమ్మకంతో ఉద్యోగ సన్నద్ధత మొదలు పెట్టండి. ఒకవేళ ఒకే సమయంలో చదివిన రెండు డిగ్రీలూ చెల్లుబాటు కావేమో అన్న సందేహం ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూవుంటే.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరో పీజీని దూరవిద్య ద్వారా పూర్తిచేసే ప్రయత్నం చేయండి.

 ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని