JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు షురూ.. ప్రాక్టీస్‌ టెస్టులు ఇవిగో!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. 

Published : 28 Apr 2024 16:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ (JEE Advanced 2024)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అవకాశం ఉండటంతో వారంతా మే 7వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.3200, మహిళలు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే రూ.1600లు చెల్లిస్తే (నాన్‌ రిఫండబుల్‌) సరిపోతుంది. మే 17 నుంచి 26వరకు అడ్మిట్‌ కార్డులు అందుబాటులో ఉంటాయి.

అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

మే 26న జరగనున్న వేళ JEE Advanced పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఐఐటీ మద్రాస్‌ (IIT Madras) ప్రాక్టీస్‌ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టెస్టులు విద్యార్థుల ప్రిపరేషన్‌కు ఎంతో అమూల్యమైనవి. పరీక్ష మోడల్‌ తెలియడంతో పాటు సమయపాలన, దాదాపు పరీక్ష రాసిన అనుభవాన్ని అందిస్తాయి. అంతేకాకుండా అభ్యర్థులు తమ బలాలు, బలహీనతల్ని అంచనా వేసుకొని మరింతగా తమను తాము మెరుగుపరుచుకొని రాణించేందుకు దోహదపడతాయి. ఈ మాక్‌ టెస్ట్‌లను జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అధికారిక వెబ్‌సైట్‌ jeeadv.ac.inలో పొందొచ్చు.  జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పేపర్‌ -1, పేపర్‌ -2 రెండింటినీ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. 

మాక్‌ టెస్టులు పొందండి ఇలా..

  • తొలుత jeeadv.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • హోమ్‌ పేజీలో రీసోర్సెస్‌ విభాగంలో పేపర్‌-1, పేపర్‌-2 ప్రాక్టీస్‌ టెస్ట్‌లు కనిపిస్తాయి.
  • పేపర్‌ -1 లేదా పేపర్‌ 2పై క్లిక్‌ చేసి సైన్‌ ఇన్‌ అవ్వండి. అక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్‌ వస్తాయి. వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాత మీ ప్రాక్టీసును మొదలుపెట్టండి. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని