JEE Main 2024: జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

ఈ నెల 27న జరిగే జేఈఈ మెయిన్‌ పేపర్‌- 1 పరీక్షకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.

Updated : 25 Jan 2024 07:11 IST

JEE Main 2024 Admit Cards | ఇంటర్నెట్‌ డెస్క్‌: జేఈఈ మెయిన్‌ సెషన్‌ -1 పరీక్షలు మొదలయ్యాయి. బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం పేపర్‌-2 పరీక్ష నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) అధికారులు పేపర్‌-1 పరీక్షకు సర్వం సిద్ధం చేశారు. 27న జరిగే పేపర్‌-1( బీఈ/ బీటెక్) పరీక్షకు అడ్మిట్‌ కార్డుల్ని (JEE Main Admit Cards) విడుదల చేశారు. విద్యార్థులు తమ అడ్మిట్‌ కార్డుల్ని ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.ac.in/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, కోర్స్, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ చేయడం ద్వారా Admit cards పొందొచ్చు.

దేశవ్యాప్తంగా జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జేఈఈ మెయిన్‌ (JEE Main) పేపర్‌ 1 పరీక్ష రెండు షిఫ్టుల్లో జరగనుంది. మొదటి షిఫ్టు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. గతేడాది కన్నా ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 12.30లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2.5లక్షల మందికి పైగా ఉన్నారు. దేశంలోని ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్‌ ర్యాంకులే ప్రామాణికం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని