JEE Main 2024: జేఈఈ (మెయిన్‌) కీపై ఛాలెంజ్‌కు గడువు పొడిగింపు

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 ప్రాథమిక కీపై అభ్యంతరాల గడువును ఎన్‌టీఏ పొడిగించింది. మంగళవారం రాత్రి కీ విడుదల చేసిన తర్వాత తలెత్తిన సాంకేతిక లోపాల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 08 Feb 2024 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జేఈఈ (మెయిన్‌) సెషన్‌ 1 (JEE Main Session 1) పరీక్ష రెస్పాన్స్‌ షీట్‌లు, ప్రాథమిక కీలను మంగళవారం రాత్రి విడుదల చేసిన జాతీయ పరీక్షల సంస్థ (NTA).. ఈ కీపై అభ్యంతరాలకు గడువు పొడిగించింది. వాస్తవానికి నేటితోనే అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియనుండగా.. సర్వర్‌లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో అభ్యర్థులు తాము రాసిన పరీక్ష పత్రాలను ప్రాథమిక కీతో సరిపోల్చుకొని ఏవైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి 11గంటల లోపు ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు చెల్లించి అధికారిక వెబ్‌సైట్‌లో ఛాలెంజ్‌ చేయొచ్చని తెలిపింది.

ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌ల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని