NTPC Jobs: ఇంకా 3 రోజులే గడువు.. ఎన్టీపీసీలో 300అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు అప్లై చేశారా?

NTPC Recruitment: ఎన్టీపీసీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తుల గడువు సమీపిస్తోంది. జూన్‌ 2తోనే దరఖాస్తులకు సమయం ముగుస్తుండటంతో ఆసక్తికలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోండి....

Published : 30 May 2023 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (NTPC) లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు సమీపిస్తోంది. వివిధ కేటగిరీల్లో 300 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఆపరేషన్స్‌/మెయింటీనెన్స్‌ E3 లెవెల్‌లో పనిచేసేందుకు అభ్యర్థులకు గత అనుభవం తప్పనిసరి. ఆసక్తికలిగిన అభ్యర్థులు జూన్‌ 2వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉంది.

నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలివే..

  • విద్యార్హతలు: బీఈ/బీ.టెక్‌లలో (ఎలక్ట్రికల్‌/మెకానికల్‌/ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌) కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.  ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే పాస్‌ మార్కులు ఉంటే చాలు.
  • 200 మెగా వాట్స్‌ అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన పవర్‌ ప్రాజెక్టు/ప్లాంట్‌లలో అభ్యర్థులకు కనీసం 7 ఏళ్లు పనిచేసిన అనుభవం తప్పనిసరి. 
  • వయో పరిమితి: 35 ఏళ్లు
  • వేతనం: E3 గ్రేడ్‌/ఐడీఏ నెలకు రూ.60వేలు నుంచి 1,80,000లక్షల వరకు
  • విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్‌ విభాగంలో 120; మెకానికల్‌ విభాగంలో 120, ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగంలో 60 చొప్పున పోస్టులు ఖాళీ ఉన్నాయి. 
  • ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/ దివ్యాంగులకు వయో సడలింపు ఇస్తారు. 
  • నియామక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేసేందుకు క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని