TSLPRB: ఏప్రిల్‌ 2న కానిస్టేబుల్‌ సాంకేతిక విభాగం తుది రాత పరీక్ష.. హాల్‌టికెట్లు విడుదల

సాంకేతిక విభాగానికి సంబంధించి పోలీస్‌ రవాణా సంస్థలో డ్రైవర్, మెకానిక్‌.. అగ్నిమాపక శాఖలో డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టుల కోసం పోటీ పడుతున్న కానిస్టేబుల్‌ అభ్యర్థుల తుది రాత పరీక్షను ఏప్రిల్‌ 2న నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Published : 28 Mar 2023 22:22 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(TSLPRB) ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి అభ్యర్థుల తుది రాతపరీక్షలు కొనసాగుతున్నాయి. సాంకేతిక విభాగానికి సంబంధించి పోలీస్‌ రవాణా సంస్థలో డ్రైవర్, మెకానిక్‌.. అగ్నిమాపక శాఖలో డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టుల కోసం పోటీ పడుతున్న కానిస్టేబుల్‌ అభ్యర్థుల తుది రాత పరీక్షను ఏప్రిల్‌ 2న నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.  ఫైర్‌ సర్వీసెస్‌ శాఖలో డ్రైవర్‌ ఆపరేటర్‌ అభ్యర్థులకు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట  వరకు; అలాగే, పోలీస్‌ కానిస్టేబుల్‌ మెకానిక్‌ అభ్యర్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి 28న రాత్రి నుంచి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ పోలీస్‌ నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 93937 11110 లేదా 93910 05006 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు. హాల్‌టికెట్‌పై తప్పనిసరిగా ఫొటోను అతికించి పరీక్షకు హాజరు కావాలని స్పష్టంచేశారు.

హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని