Honey: ఉదయాన్నే తేనె-నిమ్మరసం కలిపి తాగుతున్నారా?
ఇంటర్నెట్‌డెస్క్: రోగనిరోధకశక్తి బలోపేతం కావటానికి తేనె(Honey) బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విశృంఖల కణాలను, హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు దండిగా ఉంటాయి. తేనెను శుద్ధి చేసినప్పుడు, వెలుగు తగిలినప్పుడు దీనిలోని పుప్పొడి దెబ్బతింటుంది. ఎక్కువ పోషకాలు ఉండేది ఇందులోనే. అందువల్ల ముడి తేనె అయితే మేలు.
* క్యాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి.
* ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి.
* ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచాడు తేనె, సగం చెక్క నిమ్మరసం కలిసి పరగడుపున తాగితే మలబద్ధకం, ఛాతీ మంట తగ్గుతాయి.
* ఊబకాయం తగ్గటానికి ఉపవాసం చేసేవారు తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
* మద్యం తాగిన మర్నాడు తలెత్తే తలనొప్పి వంటి సమస్యలకూ తేనె కళ్లెం వేస్తుంది. ఇందులోని ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర కాలేయం మద్యాన్ని త్వరగా విడగొట్టేలా చేస్తుంది. హాయి భావన కలిగిస్తుంది.
* చెంచా తేనెకి... చెంచా నిమ్మరసం కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
* ఒక కప్పు హెర్బల్‌టీకి ఒక చెంచా తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి చక్కని డిటాక్సిఫికేషన్ జరుగుతుంది.
* బరువు తగ్గాలనుకునేవారు చెంచా తేనెకి... అరచెంచా దాల్చినచెక్క పొడి కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పంటిసమస్యల నుంచీ ఉపశమనం కలుగుతుంది.
* రెండు చెంచాల యాపిల్‌సిడార్ వెనిగర్‌కి ఒక చెంచా చొప్పున తేనె కలిపి తాగితే... సైనస్ అదుపులో ఉంటుందట.
* తేనె, గులాబీనీరు వంటి వాటిలోని వ్యాధినిరోధక గుణాలు మచ్చలను దూరం చేస్తాయి. గులాబీ నీరు చర్మంలోని పీహెచ్ స్థాయులను సమన్వయం చేసి, తాజాగా ఉంచుతుంది.
* ఆరోగ్యమైన, సహజ రంగులో అధరాలుండాలంటే మృతకణాలను తొలగించాలి. అందుకు స్పూను తేనెలో పంచదారను కలిపి సున్నితంగా రుద్దితే మంచి ఫలితముంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rent a girl friend: అద్దెకు గర్ల్‌ఫ్రెండ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్...
-
India News
దేవుడా.. ఈ బిడ్డను సురక్షితంగా ఉంచు: భూప్రకంపనల మధ్యే సి-సెక్షన్ చేసిన వైద్యులు..!
-
Politics News
AP News: ఎవరి అంతరాత్మ ఎలా ప్రబోధిస్తుందో?.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి
-
Sports News
IND vs AUS: భారత్, ఆసీస్ మూడో వన్డే.. ఆలౌటైన ఆస్ట్రేలియా
-
India News
Modi: JAM-జన్‌ధన్, ఆధార్, మొబైల్.. ప్రపంచానికే ఓ కేస్‌స్టడీ
-
Crime News
Vijayawada: విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న రూ.7.48కోట్ల విలువైన బంగారం పట్టివేత