పిల్ల ‘ఊపిరి’కి కాలుష్య కాటు!

వాహనాలు ఎక్కువగా తిరిగే రద్దీ రోడ్లకు దగ్గర్లో నివసిస్తున్నారా? అయితే పిల్లల ఊపిరితిత్తులు జాగ్రత్త. ఎందుకంటే రద్దీ రోడ్లకు 50 మీటర్ల దూరంలో నివసించే పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదల 14% మేరకు కుంటుపడుతున్నట్టు బ్రిటన్‌ పరిశోధకులు గుర్తించారు.

Published : 03 Dec 2019 00:23 IST

వాహనాలు ఎక్కువగా తిరిగే రద్దీ రోడ్లకు దగ్గర్లో నివసిస్తున్నారా? అయితే పిల్లల ఊపిరితిత్తులు జాగ్రత్త. ఎందుకంటే రద్దీ రోడ్లకు 50 మీటర్ల దూరంలో నివసించే పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదల 14% మేరకు కుంటుపడుతున్నట్టు బ్రిటన్‌ పరిశోధకులు గుర్తించారు. ఊపిరితిత్తుల సామర్థ్యం లోపిస్తే రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గుతుంది. బ్రాంకైటిస్‌ వంటి జబ్బులూ తలెత్తుతాయి. అప్పటికే ఏవైనా సమస్యలుంటే లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. అందువల్ల వాతావరణ కాలుష్యాన్ని తగ్గించటం మీద దృష్టి సారించటం మనందరి బాధ్యతని పరిశోధకులు సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని