మాస్క్‌ మహిమ

ఇంత కరోనా విలయంలోనూ జపాన్‌లో దిగ్బంధం విధించలేదు. దుకాణాలు తెరిచే ఉంటున్నాయి....

Published : 19 May 2020 00:13 IST

ఇంత కరోనా విలయంలోనూ జపాన్‌లో దిగ్బంధం విధించలేదు. దుకాణాలు తెరిచే ఉంటున్నాయి. వ్యాపారాలు సాగుతూనే ఉన్నాయి. ఇన్‌ఫెక్షన్‌ వచ్చినవారికి సన్నిహితంగా మెలిగిన వారిని పట్టుకునే ప్రయత్నమూ చేయటం లేదు. అయినా కూడా ఇతర దేశాలతో పోలిస్తే అక్కడ కరోనా మరణాలు చాలా తక్కువ. ఇదెలా సాధ్యమైంది? అంతా మాస్కు మహిమే. జపాన్‌లో ప్రతి ఒక్కరూ విధిగా ముఖానికి మాస్క్‌ ధరిస్తుండటం వల్లనే కరోనా వ్యాప్తిని బాగా కట్టడి చేయగలుగుతున్నారని నిపుణులు భావిస్తున్నారు. పైగా అక్కడంతా శుభ్రతకు చాలా ప్రాధాన్యమిస్తారు. ప్రతి 10 లక్షల మందిలో అమెరికాలో 164.5 మంది, స్పెయిన్‌లో 490 మంది కరోనాతో మరణిస్తుండగా జపాన్‌లో కేవలం 2.85 మంది మాత్రమే మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇతరులకు దూరంగా ఉండటమే కాదు, మాస్కు ధారణ కూడా చాలా ముఖ్యమనే నిజాన్ని ఇది చెప్పకనే చెబుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని