గుండెకు వెచ్చటి అండ

గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే వచ్చే హుషారే వేరు. ఇది కీళ్ల నొప్పులు, ఒత్తిడి తగ్గటానికి.. నిద్ర బాగా పట్టటానికీ తోడ్పడుతుంది. అంతేనా? గుండెకూ మేలు చేస్తుంది.

Published : 25 May 2021 00:06 IST

గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే వచ్చే హుషారే వేరు. ఇది కీళ్ల నొప్పులు, ఒత్తిడి తగ్గటానికి.. నిద్ర బాగా పట్టటానికీ తోడ్పడుతుంది. అంతేనా? గుండెకూ మేలు చేస్తుంది. రోజూ గోరువెచ్చటి నీటితో తొట్టి స్నానం చేసేవారికి గుండెజబ్బు ముప్పు 28% తక్కువగా ఉంటున్నట్టు జపాన్‌ అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. పక్షవాతం వచ్చే అవకాశమూ 26% తగ్గుతోందని వివరిస్తోంది. సుమారు 20 ఏళ్ల పాటు వ్యక్తుల అలవాట్లను పరిశీలించి మరీ ఈ విషయాన్ని గుర్తించారు. ఇది కేవలం పరిశీలనాత్మక అధ్యయనమే. రోజూ తొట్టిస్నానం చేస్తే గుండెజబ్బులు తగ్గుతాయని ఇందులో నిరూపణ కాలేదు. కానీ తొట్టిస్నానంతో వ్యాయామం మాదిరి ప్రయోజనాలు కనిపిస్తున్నట్టు గత అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ లాభాల మాటెలా ఉన్నా తొట్టిస్నానం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. నీరు మరీ వేడిగా ఉంటే ఒళ్లు కాలిపోవచ్చు. కొందరు తికమక పడిపోవచ్చు. నీటిలో మునిగిపోయే ప్రమాదమూ ఉంది. తాజా అధ్యయనం కొసమెరుపు ఏంటంటే- వేడి నీటి షవర్‌ స్నానం వల్ల మాత్రం గుండెకు ప్రత్యేక ప్రయోజనాలేవీ కనిపించటం లేదని తేలటం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని