సర్వాంగ ప్రయోజనం

ఒకే ఆసనంతో శరీరంలోని అన్ని భాగాలకు ప్రయోజనం కలగాలని కోరుకుంటున్నారా? అయితే సర్వాంగాసనం ప్రయత్నించండి.

Updated : 10 Aug 2021 05:45 IST

కే ఆసనంతో శరీరంలోని అన్ని భాగాలకు ప్రయోజనం కలగాలని కోరుకుంటున్నారా? అయితే సర్వాంగాసనం ప్రయత్నించండి.

* ముందుగా వెల్లకిలా పడుకొని మోకాళ్లను మడచి, మడమలను పిరుదులకు తాకించాలి. తర్వాత మోకాళ్లను లేపి పొట్ట వైపునకు తేవాలి. చేతులను నడుముకు ఆనించి, ఒక్క ఉదుటున తుంటిని పైకి లేపాలి. భుజాలు, మోచేతులు నేలకు ఆనించి ఉంచాలి. ఇప్పుడు కాళ్లను తిన్నగా పైకి చాచాలి. ఇది చాలా కీలకమైన దశ. శరీరం తూలిపోకుండా నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. శ్వాసను యథావిధిగా తీసుకోవాలి. కళ్లను మూసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత నెమ్మదిగా మామూలు స్థితికి రావాలి.

* సర్వాంగాసనం అన్ని వయసుల వారికీ మేలు చేస్తుంది. మెదడు, ఊపిరితిత్తులు, గుండెను బలోపేతం చేస్తుంది. రక్తం శుద్ధి కావటానికి తోడ్పడుతుంది. కళ్లు, చెవి, నోటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగవుతుంది. అనవసర  కొవ్వు తగ్గుతుంది. మేధాశక్తి పుంజుకుంటుంది.  అధిక రక్తపోటు, గుండెజబ్బులు, చెవిలో చీము, మెడనొప్పి వంటి సమస్యలు గలవారు.. గర్భిణులు దీన్ని వేయకూడదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని