ఇప్పుడు రెండో టీకా తీసుకుంటే ఇబ్బందా?

నా వయసు 18 ఏళ్లు. నేను జూన్‌లో కొవిషీల్డ్‌ మొదటి టీకా తీసుకున్నాను. అనంతరం కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీకి సన్నద్ధమయ్యే క్రమంలో న్యుమోకోకల్‌ టీకా తీసుకున్నాను. ఇప్పుడు కొవిషీల్డ్‌ రెండో మోతాదు టీకాకు సమయం దగ్గర పడుతోంది. దీన్ని తీసుకోవచ్చా?

Published : 21 Sep 2021 00:58 IST

సమస్య సలహా

సమస్య: నా వయసు 18 ఏళ్లు. నేను జూన్‌లో కొవిషీల్డ్‌ మొదటి టీకా తీసుకున్నాను. అనంతరం కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీకి సన్నద్ధమయ్యే క్రమంలో న్యుమోకోకల్‌ టీకా తీసుకున్నాను. ఇప్పుడు కొవిషీల్డ్‌ రెండో మోతాదు టీకాకు సమయం దగ్గర పడుతోంది. దీన్ని తీసుకోవచ్చా? - ఎం.సాయికృష్ణా రావు (ఈమెయిల్‌)

సలహా: తప్పకుండా తీసుకోవచ్చు. ఇబ్బందేమీ ఉండదు. మొదట్లో కొవిడ్‌-19 టీకా తీసుకోవటానికి 14 రోజుల ముందు, తర్వాత ఇతరత్రా టీకాలేవీ తీసుకోవద్దని సూచించారు. దీని ఉద్దేశం కొవిడ్‌ టీకా దుష్ప్రభావాలను బాగా అర్థం చేసుకోవటమే. ఇప్పుడు టీకా భద్రతకు సంబంధించి పూర్తి సమాచారం అందుబాటులో ఉంది. మిగతా టీకాలకు, కొవిడ్‌-19 టీకాలకు మధ్య ఎడమ పాటించాల్సిన అవసరం లేదని ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నారు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా రెండో మోతాదు టీకా తీసుకోవచ్చు. న్యుమోనియా టీకాకు కొవిడ్‌ టీకాకు సంబంధమేమీ లేదు. సమయం ప్రకారం తీసుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. టీకాతో దుష్ప్రభావాలు గానీ టీకాలు పనిచెయ్యకపోవటం గానీ ఉండవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని