నడక మీద బొజ్జ భారం

వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలు క్షీణించటం, కీళ్ల జబ్బులు, నొప్పి, నాడీ సమస్యల వంటివి మొదలవుతుంటాయి. ఇవి మన కదలికల తీరునూ దెబ్బతీస్తాయి.

Updated : 05 Oct 2021 03:17 IST

యసు పెరుగుతున్న కొద్దీ కండరాలు క్షీణించటం, కీళ్ల జబ్బులు, నొప్పి, నాడీ సమస్యల వంటివి మొదలవుతుంటాయి. ఇవి మన కదలికల తీరునూ దెబ్బతీస్తాయి. కుర్చీలో కూర్చుంటున్నప్పుడు, లేస్తున్నప్పుడు ఇబ్బంది పడటం.. నడుస్తున్నప్పుడు తూలటం, కింద పడటం వంటివన్నీ కదలికల సమస్యలతో ముడిపడినవే. వీటి విషయంలో కండరాల క్షీణతకు బొజ్జ కూడా తోడైతే మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశముందని తాజా అధ్యయనం పేర్కొంటోంది. ఇవి రెండూ ఉన్న వృద్ధుల్లో స్థిరంగా నడిచే సామర్థ్యం త్వరగా క్షీణిస్తున్నట్టు తేలింది. దీంతో నడక వేగమూ నెమ్మదిస్తుంది. కాబట్టి ముందునుంచే కండరాల పటుత్వానికి తోడ్పడే వ్యాయామాలు చేయటంతో పాటు బొజ్జ పెరగకుండా చూసుకోవటం మంచిదని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని